జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విష్ణు మంచు.. నటించిన లేటెస్ట్ మూవీ ‘జిన్నా’. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ మూవీని ‘అవా ఎంటర్‌టైన్‌మెంట్’, ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ వంటి మాస్ చిత్రాన్ని తెరకెక్కించిన ఈషాన్ సూర్య ‘జిన్నా’ కి దర్శకత్వం వహించాడు. అయితే కథ జి.నాగేశ్వర రెడ్డి, మాటలు స్క్రీన్ ప్లే కోన వెంకట్ అందించారు.
పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్.. హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ‘జిన్నా’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి మంచి టాక్ వచ్చింది. అయితే పోటీలో రిలీజ్ అవ్వడం వలన ఈ మూవీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయితే హిట్టు ప్లాప్ అనే వాటితో సంబంధం లేకుండా మంచు విష్ణు సినిమాలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగా జరుగుతుంది.
ఇదే క్రమంలో ‘జిన్నా’ చిత్రం డిజిటల్ హక్కులకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. మంచి డీల్ ను ఫైనల్ చేయడంలో కొంత టైం పట్టింది. మొత్తానికి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ‘జిన్నా’ డిజిటల్ హక్కులను దక్కించుకుంది. డిసెంబర్ 2 నుండి జిన్నా మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ మూవీలో కొన్ని హారర్ ఎలిమెంట్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కు కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఈ వీకెండ్ కు కుటుంబంతో కలిసి హ్యాపీగా చూడదగ్గ సినిమాగా ‘జిన్నా’ ని చెప్పుకోవచ్చు. తెలుగుతో పాటు మలయాళం వెర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుంది.