Godfather OTT: ఓటీటీలో గాడ్ ఫాదర్ మూవీ రెస్పాన్స్ ఏంటో తెలుసా?

చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో పాటు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిందనే సంగతి తెలిసిందే. అయితే అప్పటికే లూసిఫర్ సినిమాను చూసిన ప్రేక్షకులు గాడ్ ఫాదర్ సినిమాను ఓటీటీలో చూడటానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఫలితంగా గాడ్ ఫాదర్ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ లో గత కొన్నిరోజులుగా గాడ్ ఫాదర్ స్ట్రీమింగ్ అవుతుండగా టాప్3 లో ఈ సినిమాలో ట్రెండ్ అవుతుండటం గమనార్హం.

థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన గాడ్ ఫాదర్ మూవీ ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓటీటీలో గాడ్ ఫాదర్ రెస్పాన్స్ గురించి తెలిసి ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. చిరంజీవి సినిమాలకు ప్రేక్షకులలో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని అందుకు సాక్ష్యం ఇదేనని చిరంజీవి అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వాల్తేరు వీరయ్య సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాగా ఈ పాటకు ప్రేక్షకుల నుంచి భారీ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.

చిరంజీవి వాల్తేరు వీరయ్యతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారని అభిమానులు భావిస్తున్నారు. ముఠామేస్త్రి తర్వాత ఆ తరహా పాత్రలో చిరంజీవి నటిస్తుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా బాబీ కెరీర్ కు కూడా ఈ సినిమా కీలకమనే సంగతి తెలిసిందే. చిరంజీవి రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అంచనాలకు మించి సక్సెస్ సాధించడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవికి రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus