Godfather Movie: చిరంజీవి సినిమాకు ఇలాంటి పరిస్థితా?

ఓ హీరో నుండి సినిమా వస్తోంది అంటే.. ప్రచారం ఓ రేంజిలో చేస్తుంటారు. నిన్నగాక మొన్న ఇండస్ట్రీకి వచ్చిన హీరోకు కూడా భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అలాంటి చిరంజీవి లాంటి స్టార్‌ హీరో సినిమా అంటే ప్రచారం ఎలా సాగాలి. కానీ ‘గాడ్‌ఫాదర్‌’ విషయంలో అలాంటిదేం కనిపించడం లేదు. ప్రచారం మాట పక్కన పెడితే.. అభిమానుల ఎమోషన్స్‌తో సినిమా టీమ్‌ ఆడుకుంటోంది. సినిమా విడుదలకు ఇంకా పట్టుమని 20 రోజులు కూడా లేవు. ఈ సమయంలో ప్రచారంలో ఏ మాత్రం ప్రభావవంతంగా లేకపోవడమే కారణం.

‘తార్‌ మార్‌ తక్కడ్‌ మార్‌..’ అంటూ ఓ చిన్న ప్రోమోను ఆ మధ్య వదిలారు. ఆ సమయంలో ఏదీ అనుకున్నట్లు, చెప్పినట్లు టీమ్‌ చేయలేదు. చెప్పిన టైమ్‌కి టీజర్‌ రాలేదు. పోనీ తర్వాత ఇస్తాం అనే ట్వీట్‌ కూడా చేయలేదు. దీంతో అభిమానులు సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ ట్విటర్‌ పేజీని రిఫ్రెష్‌ చేస్తూ కూర్చున్నారు. ఆఖరికి ఓ గంట తర్వాత మరో గంట తర్వాత అప్‌డేట్‌ అని చెప్పారు. తీరా చూస్తే పాట టీజర్‌ చెప్పిన టైమ్‌కి సంబంధం లేకుండా ముందే వదిలేశారు. పాట ట్యూన్‌ పాతదే అయ్యేసరికి అభిమానులు నిరుత్సాహపడ్డారు.

పోనీ ఇక్కడితో ఈ లేట్‌ బిజినెస్‌ అయిపోద్ది అనుకున్నారు అభిమానులంతా. కానీ 15వ తేదీ లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేస్తాం అంటూ పోస్టర్‌ వదిలారు. దీంతో ‘హమ్మయ్య.. వావ్‌’ అంటూ ఓ మిక్స్‌డ్‌ ఫీలింగ్స్‌ కనిపించాయి అభిమానుల్లో. తీరా చూస్తే చెప్పిన సమయానికి ఆడియో సాంగ్‌ను విడుదల చేసి ఎంజాయ్‌ చేయండి అంటూ ట్వీట్‌ వేసి ఊరుకున్నారు. లిరికల్‌ సాంగ్‌ సూన్‌ అంటూ పుండు మీద కారం చల్లారు. దీంతో ట్విటర్‌లో ప్రొడక్షన్‌ హౌస్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు.

సినిమా మీద సరైన హైప్‌ లేదని ఓవైపు అభిమానులు బాధపడుతుంటే, ఇలా అభిమానులతో ఆటలాడుకుని ఏం సాధిద్దామని మీ ప్రయత్నం అంటూ నేరగా ప్రొడక్షన్‌ హౌస్‌ ట్వీట్ల కింద కామెంట్స్‌ చేస్తున్నారు అభిమానులు. ఈ విషయంలో చిరంజీవి ఇప్పటికైనా కేర్ తీసుకోవాలి అనేది వారి ఆశ. బాసూ.. వింటున్నావా? కనీసం ఉండీ ఉండనట్లు ఉన్న ఆయన పీఆర్‌ టీమ్‌ అయినా ఈ విషయంలో స్పందిస్తుందేమో చూడాలి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus