టాలెంటెడ్ హీరో సత్యదేవ్ మంచి కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. హీరోగానే కాకుండా పక్క హీరోల సినిమాల్లో ప్రాముఖ్యమైన పాత్రలు కూడా చేస్తూ బిజీగా గడుపుతూ ఉంటాడు. ఇతని కెరీర్లో పలు యావరేజ్ సినిమాలు ఉన్నాయి కానీ హిట్ అనిపించుకున్న సినిమాలు లేవు. ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రం మంచి టాక్ సంపాదించుకున్నప్పటికీ అది ఓటీటీలో రిలీజ్ అయ్యింది. సత్యదేవ్ కు మంచి బ్లాక్ బస్టర్ పడితే క్రేజీ హీరో అయిపోతాడు అనడంలో సందేహం లేదు.
ఇక సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ సే’ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బ్లఫ్ మాస్టర్’ వంటి మంచి కంటెంట్ ఉన్న చిత్రాన్ని తెరకెక్కించిన గోపికృష్ణ పట్టాభి ఈ చిత్రానికి దర్శకుడు.సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ప్రచార చిత్రాలు బాగుండడంతో ఈ సినిమా పై కొద్దిపాటి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో పర్వాలేదు అనిపించే రేంజ్లో ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ జరిగింది. వాటి వివరాలను గమనిస్తే :
నైజాం
1.20 cr
సీడెడ్
0.30 cr
ఆంధ్రా(టోటల్)
1.50 cr
ఏపి+తెలంగాణ (టోటల్)
3.00 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.28 cr
ఓవర్సీస్
0.20 cr
వరల్డ్ వైడ్ టోటల్
3.48 cr
‘గాడ్ సే’ చిత్రానికి రూ.3.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.3.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఈ మధ్య కాలంలో సత్యదేవ్ నటించిన సినిమాలు ఈ రేంజ్లో కలెక్ట్ చేసిన సందర్భాలు లేవు. ‘గాడ్ సే’ చిత్రానికి సి.కళ్యాణ్ నిర్మాత కాబట్టి ఈ స్థాయిలో బిజినెస్ అయినట్లు తెలుస్తుంది. పోటీగా ‘విరాటపర్వం’ సినిమా ఉంది కాబట్టి.. పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంటే తప్ప బ్రేక్ ఈవెన్ కష్టమే అని చెప్పాలి.