మాస్ మహారాజ్ రవితేజ నిర్మాతగా పూర్తిస్థాయిలో మారి చేసిన సినిమా ‘ఛాంగురే బంగారు రాజా’. కార్తీక్ రత్నం హీరోగా నటించిన ఈ సినిమాతో గోల్డీ నిస్సి హీరోయిన్ గా పరిచయమవుతోంది. సెప్టెంబర్ 15న విడుదల కాబోతున్న ఈ చిత్రం గురించి గోల్డీ నిస్సి చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం :
ప్ర) మీ నేపథ్యం గురించి చెప్పండి?
గోల్డీ నిస్సీ : నేను తెలుగమ్మాయినే.! బెంగళూరుకి చెందిన నేను ఇక్కడి ఇంజనీరింగ్ చదువుకోవడానికి వచ్చాను. నటన పై ఉన్న మక్కువతో మోడలింగ్ చేశాను. అలాగే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించాను.
ప్ర) ‘ఛాంగురే బంగారు రాజా’ ప్రాజెక్టులోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు?
గోల్డీ నిస్సీ : షార్ట్ ఫిలిమ్స్ కి కొంత గ్యాప్ ఇచ్చి బిగ్ స్క్రీన్ పై కనిపించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఆ టైంలో చాలా చోట్ల ఆడిషన్స్ ఇచ్చాను. అదృష్టం కొద్దీ ఈ సినిమాలో ఛాన్స్ లభించింది.
ప్ర) ఇదే సినిమాతో రవితేజ గారు సోలో నిర్మాతగా మారారు.. మీరు కూడా మెయిన్ హీరోయిన్ అయ్యారు. ఎలా ఫీలవుతున్నారు?
గోల్డీ నిస్సీ : రవితేజ గారి ప్రొడక్షన్ హౌస్ లో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకొని ఆడిషన్స్ ఇచ్చాను. నా ఆడిషన్స్ నచ్చి టీం సెలెక్ట్ చేసింది. ‘ఛాంగురే బంగారురాజా’ నా ఫస్ట్ బిగ్ సినిమా అవ్వడం నాకు ఆనందంగా ఉంది.
ప్ర) ‘ఛాంగురే బంగారురాజా’లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?
గోల్డీ నిస్సీ : ఈ సినిమాలో నా పాత్ర పేరు మంగ రత్నం. ఓ లేడీ కానిస్టేబుల్ పాత్ర. కొంచెం గ్రే షేడ్ ఉంటుంది. మంగ రత్నం ను బంగార్రాజు ల మధ్య సాగే లవ్ ట్రాక్.. బాగుంటుంది.
ప్ర) రవిబాబు, సత్యతో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
గోల్డీ నిస్సీ : చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేశాను. సత్య గారు ఆఫ్ స్క్రీన్ కూడా చాలా హ్యూమరస్ గా ఉంటారు. రవి గారు చాలా నాలెడ్జ్ పర్సన్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.
ప్ర) హీరో కార్తీక్ రత్నం కి మీకు మధ్య వచ్చే సన్నివేశాలు ఎలా ఉంటాయి?
గోల్డీ నిస్సీ : చాలా క్యూట్ గా ఉంటాయి. అందరికీ నచ్చుతాయి.
ప్ర) ఇక నుండి హీరోయిన్ గానే కొనసాగుతారా.. వేరే పాత్రలు కూడా చేస్తారా ?
గోల్డీ నిస్సీ : మంచి కంటెంట్ ఉన్న కథలు వస్తే అన్ని రకాల పాత్రలు చేయడానికి రెడీగా ఉన్నాను.
ప్ర) ఈ సినిమా షూటింగ్ టైంలో రవితేజ గారు ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి ?
గోల్డీ నిస్సీ : షూటింగ్ పూర్తయ్యాకే మేము రవితేజ గారిని కలిశాం. ఆయన్ని చూసినప్పుడు ఏం మాట్లాడలేకపోయాను. ఆయన మాత్రం .. ‘’సినిమా చూశాను. అందరూ చాలా బాగా చేశారు. నువ్వు కొత్త అయినా కూడా భయం లేకుండా నటించావ్’’ అంటూ ప్రశంసించారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది.
ప్ర) సోషల్ మీడియాలో మీరు ఓ స్టార్. అది మానేసి సినిమా ఛాన్స్ ల కోసం ప్రయత్నించడం రిస్క్ అనిపించలేదా?
గోల్డీ నిస్సీ :నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు కూడా ఫ్రీ లాన్సింగానే చేశాను. కానీ సినిమాపై ప్యాషన్ ఎక్కువ ఉంది. ప్రయత్నిస్తున్నప్పుడు రిజల్ట్ అనుకున్నట్టు రాకపోతే వెనక్కి వెళ్ళిపోదామా అనే ఆలోచనలు కూడా వస్తాయి. కానీ 2 ఏళ్ళ నిరీక్షణకు సరైన ఫలితం దక్కింది అనుకుంటున్నాను.
ప్ర) దర్శకులు సతీష్ వర్మ గారి గురించి ?
సతీష్ గారికి క్లారిటీ ఎక్కువ. స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా అలా డైలాగ్ చూసుకొని సీన్ ని అర్థం చేసుకొని చేసేయొచ్చు. అంత నీట్ గా రాశారు. అలాగే కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
ప్ర) సినీ పరిశ్రమలో అమ్మాయిలకి ఇబ్బందులు ఎదురవుతాయి అంటారు? ఉదాహరణకి క్యాస్టింగ్ కౌచ్ లాంటివి..! మీకేమైనా అలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయా?
గోల్డీ నిస్సీ : అది ఎగ్జాక్ట్ గా చెప్పలేను. కానీ.. నేను చాలా చోట్ల ఆడిషన్స్ ఇచ్చాను. ఆ టైంలో ఎక్కువ మంది ‘నువ్వు బాగా చేస్తున్నావ్ కానీ’ అని చెప్పి రిజెక్ట్ చేసేవారు. బహుశా ఆ కానీలోనే అలాంటిది ఉందేమో.
ప్ర) మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి?
గోల్డీ నిస్సీ :ఇంకా ఏదీ ఫైనల్ అవ్వలేదు. ప్రస్తుతం ‘ఛాంగురే బంగారు రాజా’ ఫలితం కోసం ఎదురు చూస్తున్నాను.