Tollywood: 2024లో ఆరుగురు యంగ్ స్టార్స్ సినిమాల రిలీజ్.. ఎక్కడా తగ్గట్లేదుగా!

ప్రతి సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీలో వందల సంఖ్యలో సినిమాలు తెరకెక్కుతున్నా విడుదలవుతున్న సినిమాల సంఖ్య తక్కువగా ఉందనే సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు రెండేళ్లకు, మూడేళ్లకు ఒక సినిమాను విడుదల చేస్తుండటంతో అభిమానులు తెగ ఫీలవుతున్నారు. అయితే 2024 సంవత్సరం ఫ్యాన్స్ కు కచ్చితంగా స్పెషల్ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 2024 సంవత్సరంలో ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్ కే రిలీజ్ కానుంది. ప్రభాస్ మారుతి కాంబో మూవీ సైతం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి.

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ సైతం 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ 2024 సమ్మర్ కానుకగా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి ఇప్పటికే ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. బన్నీ సుకుమార్ కాంబో మూవీ పుష్ప2 కూడా 2024 సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పుష్ప ది రైజ్ ను మించి ఈ సినిమా ఉండేలా మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. రామ్ చరణ్ శంకర్ కాంబో మూవీ సైతం 2024 సమ్మర్ టార్గెట్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కూడా గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలకు కొదువ ఉండదని అదుర్స్ అనిపించే సీన్స్ ఎక్కువగా ఉంటాయని సమాచారం.

ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలు (Tollywood) కాగా బాక్సాఫీస్ పోటీలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ మధ్య కాలంలో ఆరుగురు హీరోల సినిమాలు ఒకే ఏడాది విడుదల కావడం 2024లోనే జరుగుతోంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus