ఈ ఏడాది చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కారు.శర్వానంద్, వరుణ్ తేజ్ వంటి యంగ్ హీరోలు.. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. అలాగే సీరియల్స్ లో నటించే వారు, అలాగే బుల్లితెర పై ఇమేజ్ సంపాదించుకున్న వారు సైతం పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగు పెట్టే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మధ్యనే బిగ్ బాస్ కంటెస్టెంట్ అలాగే సీరియల్ హీరో అయిన మానస్ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చేశాడు.
అంతేకాకుండా ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ తో పాపులర్ అయిన ప్రేరణ కూడా తన ప్రియుడిని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగుపెట్టింది. అక్టోబర్ చివర్లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా పెళ్లి చేసుకుంది. తాజాగా మరో హీరోయిన్ కూడా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది.
వివరాల్లోకి వెళితే.. ‘గుడ్ నైట్’ సినిమాతో యూత్ కి బాగా దగ్గరైన (Meetha Raghunath) మీతా రఘునాథ్ పెళ్లికి రెడీ అయ్యింది. త్వరలోనే ఈమె పెళ్లి కూడా జరగబోతుంది. ఆమె నిశ్చితార్థం ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె తనకు కాబోయే భర్తతో ఉన్న ఫొటోలను పలువురు నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. త్వరలోనే పెళ్లి డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారు. ‘గుడ్ నైట్’ సినిమాలో అమాయకురాలి పాత్రలో మీతా అందరినీ ఆకట్టుకుంది అని చెప్పాలి.