‘సిట్టింగ్’ అనే పదం వినగానే మందుబాబులు అంతా ఓ సెపరేట్ మూడ్ లోకి వెళ్ళిపోతారు. డౌటేముంది.! సాధారణంగా ‘సిట్టింగ్’ అంటే ఎవరితో ఉంటుంది… బెస్ట్.. ఫ్రెండ్స్ తోనే కదా. కొంతమంది యంగ్ హీరోలు ఈ విషయాన్ని ఓపెన్ గానే ఒప్పేసుకున్నారు. మరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సిట్టింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఎవరికీ ఉండదు. ప్రభాస్ కు బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే.. టక్కున చెప్పే పేరు గోపీచంద్. రామబాణం సినిమా ప్రమోషన్స్ లో గోపీచంద్ చురుగ్గా పాల్గొంటున్నాడు.
అతనికి ‘రామబాణం’ సినిమాతో పాటు అతని బెస్ట్ ఫ్రెండ్ ప్రభాస్ గురించి కూడా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ‘రామబాణం’ ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన ఓ ఇంటరాక్షన్ మీట్లో.. ఓ వ్యక్తి ‘ప్రభాస్.. మీరు ఎలా చిల్ అవుతూ ఉంటారు?’ అంటూ ప్రశ్నించాడు. దీనికి గోపీచంద్.. ” మీరు మీ ఫ్రెండ్స్ తో ఎలా చిల్ అవుతారో మేము కూడా అలాగే చిల్ అవుతాం. అది పెద్ద విషయం ఏమీ కాదు” అంటూ జవాబిచ్చాడు.
అలాగే ‘ప్రభాస్ తో మీరు మీ సినిమా కథల గురించి చర్చిస్తారా?’ అంటూ మరో వ్యక్తి (Gopichand) గోపీచంద్ ను ప్రశ్నించాడు. దీనికి గోపి ‘నేను నా సినిమాల కథల గురించి ప్రభాస్ తో డిస్కస్ చేయను’ అంటూ జవాబిచ్చాడు. మరో వ్యక్తి ‘ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు’ అని అడగ్గా ‘అన్ని సినిమాల కోసం వెయిట్ చేస్తున్నా.. అన్నీ చూడాలి’ అంటూ గోపీచంద్ జవాబిచ్చాడు. ఇక ‘రామబాణం’ చిత్రం మే 5న విడుదల కాబోతోంది.