గోపీచంద్ మలినేని (Gopichand).. తెలుగులోనే కాదు, బాలీవుడ్‌లోనూ ఇప్పుడు స్టార్ డైరక్టర్. ‘వీర సింహా రెడ్డి’(Veera Simha Reddy) తో తెలుగులో బ్లాక్‌బస్టర్ అందుకున్న వెంటనే బాలీవుడ్ వెళ్లి ‘జాట్’ (Jaat) సినిమా చేసి అక్కడా మంచి విజయం అందుకున్నారు. అయితే గోపీచంద్‌ను తొలి రోజుల్లో ఇండస్ట్రీలో చూసినవారు, ఇప్పుడు అతన్ని చూస్తే నమ్మరు. ఎందుకంటే వేరే దర్శకుల దగ్గర డైరక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసే సమయంలో చాలా ముభావంగా ఉండేవారట. పెద్దగా ఎవరితో మాట్లాడకుండా కామ్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్లేవారట.
అయితే ఓ స్టార్ హీరో చెప్పిన మాటలే అతన్ని మార్చాయి. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చారు. పైన చెప్పినట్లు గోపీచంద్ మలినేని ఇంట్రోవర్ట్. సినిమా సెట్‌లో ఉన్నప్పుడు పెద్దగా అందరితో కలిసేవారు కాదట. ఆయన ‘ఆందరివాడు’ (Andarivaadu) సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసే సమయంలో చిరంజీవి (Chiranjeevi) ఓ సారి గోపీచంద్ మలినేనిని పిలిచి మాట్లాడారట. సినిమా షూటింగ్ ఆఖరి రోజున ఇది జరిగిందట. ‘‘సెట్స్‌లో నిన్ను చాలా రోజులుగా చూస్తున్నా. ఏదైనా సీన్ బాగా వస్తే కాస్త ప్రశాంతంగా కనిపిస్తావ్.
సీన్ బాగా రాకపోతే డల్‌గా ఉంటావు. అంతే కానీ విషయం చెప్పడం లేదు. కాస్త ఓపెన్ అవ్వు. నీకు మంచిది’’ అని అన్నారట. నువ్వు మాట్లాడితేనే కదా అందరికీ తెలిసేది అన్నారట. ఆ మాటలు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆయన అసోసియేట్ డైరక్టర్‌గా మూడు సినిమాలకు పని చేశారట. ఆ మడూ స్టార్ హీరోల సినిమాలే. అవే ‘స్టాలిన్’ (Stalin), ‘కంత్రీ’ (Kantri), ‘బిల్లా’ (Billa).
అలా ఆ సినిమాల్లో పని చేసే సమయంలో హీరోలతో మాట్లాడటం, అభిప్రాయాలు చెప్పడం వల్ల ఆ తర్వాత దర్శకుడిగా మారాక బాలకృష్ణ (Nandamuri Balakrishna) , వెంకటేశ్ (Venkatesh) , సన్నీ డియోల్ (Sunny Deol) లాంటి అగ్ర హీరోలతో పని చేయడం సులభమైంది అని చెప్పుకొచ్చారు గోపీచంద్ మలినేని. అదన్నమాట సంగతి గోపీచంద్ మలినేని విజయ రహస్యం చిరంజీవి చెప్పిన మాట.