Gopichand: సంకల్ప్‌ రెడ్డి సినిమాలో ఆ అక్షరం మిస్ చేస్తారా? ఆ పేరు పెడతారా?

హిట్‌ కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న హీరో గోపీచంద్‌ (Gopichand), ఓ హిట్‌ కొట్టాక మరో రాక బాలీవుడ్‌కి కూడా వెళ్లొచ్చిన దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి కలసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆ సినిమా గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని చిన్నగా టీజ్‌ చేశారు. మంచు కొండల్లో వీరుడిలా గోపీచంద్‌ లుక్‌, వైబ్‌ భలే ఉంది. ఆ సినిమాకు సంబంధించి ఓ విషయం బయటకు వచ్చింది. అది వింటుంటే గోపీచంద్‌ తన సెంటిమెంట్‌ని వదిలేశాడా అని కూడా అనిపిస్తోంది.

Gopichand

‘ఘాజి’, ‘అంతరిక్షం’ సినిమాలతో తెలుగులో ప్రయోగాత్మక దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు సంకల్ప్‌ రెడ్డి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు ‘శూల’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. సినిమా అంతా ఒక ప్రదేశం చుట్టూ తిరుగుతుందని, ఆ ప్రాంతం మంచు కొండలు ఉన్న ప్రాంతంలో ఉంటుందని, సినిమా గ్లింప్స్‌లో అదే ప్రాంతం చూపించారని చెబుతున్నారు. ఆ ప్రాంతం పేరు అయిన ‘శూల’నే ఇప్పుడు టైటిల్‌గా అనుకుంటున్నారని సమాచారం.

అయితే గోపీచంద్ (Gopichand) గత సినిమా పేర్లలో ఎక్కువగా ఆఖరున పూర్ణం (o) ఉంటుంది. ‘రణం’, ‘లౌక్యం’, ‘సాహసం’, ‘సౌఖ్యం’, ‘విశ్వం’, ‘పంతం’, ‘రామబాణం’ ఇలా అన్నమాట. ఇప్పుడు సంకల్ప్‌ రెడ్డి సినిమాకు కూడా అలాంటి పేరే ఒకటి చూస్తారు అని అనుకున్నారంతా. కానీ ‘శూల’ అనే పేరు పెడతారు అని తాజా సమాచారం. మరి తనకు గత కొన్నేళ్లుగా అచ్చి రాని తన సెంటమెంట్‌ను వదులుకుని గోపీచంద్‌ (Gopichand) ఈసారి హిట్‌కొడతాడా ఏమో చూడాలి.

గోపీచంద్‌కు గత కొన్నేళ్లుగా సరైన విజయం లేదు. మధ్యలో ఒకట్రెండు సినిమాలు మోస్తరు ఫలితాన్ని అందుకున్నాయి. గతేడాది ‘భీమా’, ‘విశ్వం’ అంటూ రెండుసార్లు వచ్చి రెండు సార్లూ ఇబ్బందికర ఫలితం అందుకున్నాడు. ఇక దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి విషయానికొస్తే ‘ఐబీ 71’ అని రెండేళ్ల క్రితం బాలీవుడ్‌లో విద్యుత్‌ జమ్వాల్‌తో ఓ సినిమా చేశాడు. అది ఆశించిన ఫలితం అయితే ఇవ్వలేదు.

‘తమ్ముడు’ ఫస్ట్ డే బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది?!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus