‘పక్కా కమర్షియల్’ టీజర్ : గోపీచంద్ మార్క్ యాక్షన్.. మారుతీ మార్క్ కామెడీతో.. !

మెగా ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో ‘జి.ఏ.2 పిక్చర్స్’ ‘యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ల పై బ‌న్నీవాసు,ఎస్.కె.ఎన్ లు కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. మ్యాచో స్టార్ గోపీచంద్, రాశీఖ‌న్నా జంట‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ మారుతి తెరకెక్కిస్తున్నాడు.అన్ని కమర్షియల్ హంగులతో దర్శకుడు మారుతీ తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు ప్రేక్షకుల నుండీ అద్భుతమైన స్పందన లభించింది.

ఇక తాజాగా ‘పక్కా క‌మ‌ర్షీయ‌ల్’ నుండీ ఓ టీజ‌ర్ ను కూడా విడుదల చేసారు చిత్ర యూనిట్ సభ్యులు. ‘ఎవరికి చూపిస్తున్నారు సర్ మీ విలనిజం.. మీరు ఇప్పుడు చేస్తున్నారు నేను ఎప్పుడో చేసి చూసి వచ్చేసా.అలాగే నా హీరోయిజంకి ఓ ఆరా ఉంటుంది, కాన్సెన్ట్రేట్ చేస్తే ఆరా నుంచి ఓ ఆర్.ఆర్ వినిపిస్తుంది, ఇమేజిన్ చేసుకోండి కిక్ యాస్ ఉంటుంది’ అంటూ గోపీచంద్ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది.

గోపీచంద్ నుండీ ప్రేక్షకులు ఆశించే స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్స్ తో టీజర్ ను ప్రారంభించి మారుతీ స్టైల్ కామెడీ కూడా ఉండేలా టీజర్ ను కట్ చేశారు మేకర్స్. హీరోయిన్ రాశీ ఖన్నా… ‘ప్రతీరోజు పండగే’ తరహాలోనే ఈ సినిమాలో కూడా మంచి కామెడీ పండించినట్టు హింట్ ఇచ్చారు. సత్య రాజ్, రావు రమేష్ వంటి వారు కూడా టీజర్లో కనిపించారు. టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది అలాగే సినిమా పై ఇప్పటివరకు అంచనాలను డబుల్ చేసే విధంగా కూడా ఉందని చెప్పొచ్చు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి :

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!


రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus