Gowtam Tinnanuri: విజయ్‌ సినిమా లేట్‌ అయ్యిందని… గౌతమ్‌ మరో సినిమా

‘మళ్ళీ రావా’, ‘జెర్సీ’ లాంటి సినిమాలు ఇచ్చిన దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి.. ఆ తర్వాతి సినిమా కోసం చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమాలు కుదురుతున్నట్లే అనిపించి, ప్రకటనలు కూడా వచ్చేస్తున్నాయి. కానీ ఏమవుతుందో ఏంటో వెనక్కి వెళ్లిపోతున్నాయి. తాజాగా మరోసారి విషయంలోనూ ఇదే జరిగింది. అయితే ఇప్పుడు సినిమా ఆగిపోలేదు కానీ… ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. గౌతమ్‌ సినిమాల లైనప్‌ను మీరు ఫాలో అవుతుంటే… ఆ సినిమా విజయ్‌ దేవరకొండదే అని ఈజీగా చెప్పేస్తారు.

హీరోతో సినిమా ఓకే అనుకున్నాక… ఆ హీరో సెట్స్‌కు రావడానికి రెడీ అయ్యే దాకా ఆ డైరెక్టర్‌ వెయిట్‌ చేయాల్సిందిగా. స్టార్‌ హీరోల విషయానికొస్తే ఇది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇలా వెయిటింగ్‌ గేమ్‌ ఆడుతున్న దర్శకులు టాలీవుడ్‌లో చాలామందే ఉన్నారు. అలాంటివారిలో గౌతమ్‌ తిన్ననూరి ఒకరు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, గౌత‌మ్ తిన్న‌నూరి కాంబినేష‌న్‌లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఓ సినిమా నిర్మిస్తోంది. ఓ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జోనర్‌లో ఈ సినిమా ఉండనుంది.

రూ.వంద‌ కోట్ల‌కుపైగా బ‌డ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాకు విజయ్ దేవరకొండ డేట్స్ ఇప్పట్లో దొరికేలా లేవు అని సమాచారం. దీంతో దర్శకుడు వేరే ప్రాజెక్టు పనులు స్టార్ట్‌ చేశారు అంటున్నారు. విజయ్‌ సిద్ధమయ్యేలోగా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ ఒకటి చేయాలని అనుకుంటున్నారట. అయితే అది థియేటర్‌ కోసం కాదు ఓటీటీ కోసమట. సితార బ్యానర్‌లోనే ఈ ప్రాజెక్ట్‌ ఉందట. తొలుత కథ గౌతమ్‌ది, హ్యాండిల్‌ చేసేది వేరొకరు అని వార్తలొచ్చినా… ఇప్పుడు హ్యాండిల్‌ చేసేది కూడా గౌతమ్‌ తిన్ననూరినే అని తెలుస్తోంది.

అన్నట్లు ఈ ప్రాజెక్ట్‌లో ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో నటించిన సారా అర్జున్ ప్రధాన పాత్రలో కనిపిస్తుందట. ఆ సినిమాలో సారా… చిన్నప్పటి ఐశ్వర్య రాయ్‌గా కనిపించింది. సంగీతం నేపథ్యంలో సాగే ఈ సినిమాకు అనిరుథ్‌ సంగీతం అందిస్తారట. విక్రమ్‌, అనుష్క శెట్టి జంటగా నటించిన ‘నాన్న’ సినిమాలో విక్రమ్‌కు కూతురిగా నటించింది సారా అర్జునే అనే విషయం తెలిసిందే.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus