టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అతడు’ ‘ఖలేజా’ తర్వాత రూపొందిన మూవీ ‘గుంటూరు కారం’. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా స్పెషల్ రోల్ చేసింది. తమన్ సంగీత దర్శకుడు. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది.
అయినప్పటికీ కలెక్షన్స్ బాగానే వచ్చాయి.కానీ పండుగ సెలవులు ముగిశాక మళ్ళీ కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. అయితే రిపబ్లిక్ డే హాలిడే తో పాటు మూడో వీకెండ్ అడ్వాంటేజ్ తో మళ్ళీ కొంత క్యాష్ చేసుకుంది. అయితే 18 వ రోజు మళ్ళీ డ్రాప్ అయ్యాయి. ఒకసారి 18 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 33.50 cr |
సీడెడ్ | 9.65 cr |
ఉత్తరాంధ్ర | 12.31 cr |
ఈస్ట్ | 10.01 cr |
వెస్ట్ | 5.97 cr |
గుంటూరు | 8.21 cr |
కృష్ణా | 6.25 cr |
నెల్లూరు | 3.50 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 89.40 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 6.44 cr |
ఓవర్సీస్ | 14.71 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 110.55 cr (షేర్) |
‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాకు రూ.130.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.131 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 18 రోజులు పూర్తయ్యేసరికి రూ.110.55 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.20.45 కోట్ల షేర్ ను రాబట్టాలి. అది పూర్తిగా అసాధ్యమే. కానీ ఇప్పటివరకు నెగిటివ్ టాక్ తో బాగానే కలెక్ట్ చేసింది అని చెప్పాలి
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!