రెండు తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కారం మూవీ పాజిటివ్ టాక్ తో ప్రదర్శితం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండటంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో గుంటూరు కారం ఖాతాలో అరుదైన రికార్డ్ చేరింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గుంటూరు కారంకు తొలి రోజే 81.61 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.
ఆర్ఆర్ఆర్ మూవీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 75.85 లక్షల రూపాయలతో సాధించిన డే1 రికార్డ్ ను ఈ సినిమా బ్రేక్ చేసింది. గుంటూరు కారం ఖాతాలో అరుదైన రికార్డ్ చేరడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సినిమా సాధించిన కలెక్షన్ల విషయంలో నిర్మాతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు కారం ఫస్ట్ వీకెండ్ సమయానికి కొన్ని ఏరియాలలో బిజినెస్ లో 70 శాతానికి పైగా కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది.
పాన్ ఇండియా సినిమా కాకపోయినా గుంటూరు కారం ఈ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. ప్రేక్షకులు కోరుకున్న అన్ని అంశాలు ఉన్నాయని నిర్మాతలు చెబుతున్నారు. మహేష్ బాబు, శ్రీలీల డ్యాన్స్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సంక్రాంతి పండుగ సమయంలో రిలీజ్ కావడంతో ఈ సినిమాకు రిపీట్ ఆడియన్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంది.
మహేష్ బాబు వీరాభిమానులకు ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది. సంక్రాంతి సినిమాలన్నీ కలెక్షన్ల విషయంలో బ్రేక్ ఈవెన్ కావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. పండుగ సినిమాలు కలెక్షన్ల విషయంలో ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. ఓవర్సీస్ లో సైతం గుంటూరు కారం సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. (Guntur Kaaram) గుంటూరు కారంతో ఓవర్సీస్ లో మహేష్ బాబు ఖాతాలో అరుదైన రికార్డ్ చేరింది.