మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా కనిపించనుంది.ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఈ మధ్యనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. దీనికి మొదట మిక్స్డ్ రెస్పాన్స్ వినిపించినా.. యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది.
తప్పకుండా ఈ పాట 100 మిలియన్ వ్యూస్ ను కొల్లగొట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఈ పాటని కనుక గమనిస్తే.. ఇందులో హీరోకి రాజకీయాలు అంటే ఇష్టం లేనట్టు కొన్ని లైన్స్ ఉన్నాయి. అలాగే కొన్ని రాజకీయ పార్టీలపై సెటైర్లు వేస్తున్నట్టు కూడా లైన్లు ఉన్నాయి. దానిని బట్టే ఈ సినిమాలో పొలిటికల్ అంశాలు ఉంటాయని అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. అది నూటికి నూరు శాతం నిజం.
ఈ సినిమా కథంతా రాజకీయ నేపథ్యంలోనే ఉంటుందట. అందుతున్న సమాచారం ప్రకారం..’గుంటూరు కారం’ లో మహేష్ బాబు పాత్ర పేరు వెంకట రమణా రెడ్డి అని తెలుస్తుంది. ఇతని తండ్రి వైర వెంకట స్వామి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారట. ఆయన జన దళం పార్టీ ప్రధాన కార్యదర్శి అట. రాజకీయాలు అంటే ఇష్టం ఉండని వెంకట రమణా రెడ్డి .. ఊహించని విధంగా తన తండ్రి 80 వ పుట్టిన రోజు తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుందట.
ఆ తర్వాత అతను శత్రువులను, ప్రతికూల రాజకీయ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిగిలిన కథగా తెలుస్తుంది. గతంలో చిరంజీవి హీరోగా వచ్చిన ‘మంత్రిగారి వియ్యంకుడు’ షేడ్స్ కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి అని సమాచారం. టీజర్, ట్రైలర్స్ రిలీజ్ అయితే ఆ విషయం పై మరింత క్లారిటీ వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ కి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి.. ‘జనసేన’ పార్టీకి మైలేజ్ ఇచ్చే డైలాగులు కూడా ఈ (Guntur Kaaram) ‘గుంటూరు కారం’ లో ఉంటాయట.