ఈ మధ్య కాలంలో సినిమాలకు శాటిలైట్ బిజినెస్ అవ్వడం చాలా కష్టంగా మారింది. ఏ సినిమాకి అయినా సరే ఓటీటీ బిజినెస్ తో పాటు శాటిలైట్ బిజినెస్ కూడా చాలా ముఖ్యం. వాటి ద్వారానే సినిమా బడ్జెట్ లో చాలా వరకు రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు పెద్ద సినిమాలకు తప్ప మీడియం రేంజ్ సినిమాలకు ఓటీటీ బిజినెస్ అవ్వడం కష్టంగా మారింది. అంతే కాదు పెద్ద సినిమాలకు శాటిలైట్ బిజినెస్ జరగడం కూడా కష్టంగా మారింది.
ఎందుకంటే ఇదివరకటిలా.. ప్రతి ఇంట్లో శాటిలైట్ కనెక్షన్లు ఎక్కువ ఉండటం లేదు. ఇంటర్నెట్ కనెక్షన్లే ఎక్కువ ఉన్నాయి. మరోపక్క టీవీల్లో టెలికాస్ట్ అయ్యే వరకు కూడా ప్రేక్షకులు ఆగడం లేదు. ఓటీటీల్లోకి వచ్చిన వెంటనే చూసేస్తున్నారు. అందుకే టెలివిజన్ ప్రీమియర్లకి ఎక్కువ టి.ఆర్.పి రేటింగ్ లు నమోదు కావడం లేదు. ఇటీవల అంటే ఏప్రిల్ 7 న గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా టెలివిజన్ ప్రీమియర్ జెమినీ టీవీలో ప్రసారం అయ్యింది.
తాజాగా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ టి.ఆర్.పి రేటింగ్ బయటకి వచ్చింది. బార్క్ వారి వివరాల ప్రకారం గుంటూరు కారం సినిమా మొదటిసారి టెలికాస్ట్ కి 9.23 టి.ఆర్.పి రేటింగ్ నమోదైంది. ఇది తక్కువ రేటింగే అయినప్పటికీ ఐపీయల్ మ్యాచ్ లు వంటి వాటి హవా ముందు ఇది డీసెంట్ రేటింగ్ అనే చెప్పాలి. మరోపక్క సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా కంటే ఇది తక్కువ రేటింగ్ అని కొందరి యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు