మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన ‘గుంటూరు కారం’ సినిమా మరికొన్ని గంటల్లో అంటే జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటివరకు ‘గుంటూరు కారం’ నుండి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఏ కంటెంట్ రాలేదు. రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి మిక్స్డ్ రెస్పాన్స్ ను మూటగట్టుకున్నాయి. అయినా త్రివిక్రమ్ – మహేష్ బాబు..లకి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ఈ సినిమాకి భారీ హైప్ ను తెచ్చిపెట్టింది. మేకర్స్ అయితే సినిమా సూపర్ గా ఉంటుంది అని ఫ్యాన్స్ కి భరోసా ఇస్తున్నారు.
ఆ కాన్ఫిడెన్స్ తోనే చాలా చోట్ల మిడ్ నైట్ షోలు వేశారు. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. ‘గుంటూరు కారం’ ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉందట. ఇంటర్వెల్ బ్లాక్ మంచి హై ఇచ్చింది అంటున్నారు. చాలా కాలం తర్వాత మహేష్ ను మాస్ యాంగిల్ లో చూడటం అనేది అభిమానులకు కన్నుల పండుగలా ఉంటుందట.
సెకండ్ హాఫ్ లో బోరింగ్ పోర్షన్స్ కొన్ని ఉన్నాయంటున్నారు. అయినప్పటికీ క్లైమాక్స్ లో ఎమోషనల్ యాంగిల్ బాగా వర్కౌట్ అయ్యిందట. త్రివిక్రమ్ స్టైల్లో హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు అని తెలుస్తుంది. మొత్తంగా సంక్రాంతి పండుగకి ‘గుంటూరు కారం’ పర్ఫెక్ట్ మూవీ అని అంటున్నారు. మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి:
#GunturKaaram A Trivikram style story that is packaged with all commercial elements but none of it makes a solid impact. The movie is solely driven by Mahesh and he is at his best. Kurchi Madatha Petti song and a few entertaining blocks work well. The rest is subpar stuff and the…
Mahesh career lo this wl remain worst movie but MB performance aithe peaks
Commercial cinema antunnaru, Continuous ga kanisam 5min kuda audience ni connect cheyle, 3vkrm’s rod writings so far, Agnyathavasi lo kanisam story undhi#GunturKaaram#GunturKaaramReview#MaheshBabu