తెలుగు సినిమా (Movies) చాలా తక్కువగా జరిగే ఓ విషయం.. బుధవారం రాత్రి రెండు సినిమాల విషయంలో జరిగింది. తమ సినిమా ఆగిపోలేదు, ఆ రూమర్లు నమ్మెద్దు అంటూ ఒక టీమ్.. సినిమాకు సంబంధించిన ఏ విషయం అయినా మేమే చెబుతాం అంటూ మరో టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇందులో కూడా సినిమా స్టేటస్ మీద క్లారిటీ ఇవ్వడమే కనిపించింది. అయితే చెప్పాల్సిన విషయం మాత్రం చెప్పలేదు అనే కామెంట్లు కనిపిస్తున్నాయి.
Movies
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రెండు సినిమాల గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. అందులో కొటి ప్రభాస్ (Prabhas) – మారుతి (Maruthi Dasari) ‘ది రాజా సాబ్’ (The Rajasaab) కాగా, మరో సినిమా నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagnya) – ప్రశాంత్ వర్మ (Prasanth Varma) సినిమా. ‘ది రాజా సాబ్’ వాయిదా పడుతుంది అని కొందరు… లేదు లేదు పూర్తిగా ఆపేశారు అని కొందరు మాట్లాడుకున్నారు. ఇక మోక్షజ్ఞ సినిమా నిర్మాత మారుతారు, దర్శకుడు మారుతారు అని వార్తలొచ్చాయి. అయితే వీటిపై టీమ్స్ క్లారిటీ ఇచ్చాయి,.
అయితే కాస్త డిఫరెంట్‌గా కనిపించింది. సినిమా (Movies) టీజర్ విడుదలపై వస్తున్న రూమర్స్‌ను నమ్మొద్దు. ఏదైనా ఉంటే మేమే చెబుతాం అని నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆ ప్రెస్ రిలీజ్‌లో రాసుకొచ్చింది. మామూలుగా అయితే ఇలా టీజర్ రూమర్స్‌పై క్లారిటీలు ఇవ్వడంలో టాలీవుడ్‌లో అరుదు. మరి వీళ్లెందుకు ఇచ్చారు అంటే.. సినిమా మీద వస్తున్న ఇతర రూమర్స్ నమ్మొద్దు అని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పడమే.
ఇక మోక్షజ్ఞ – ప్రశాంత్ వర్మ ప్రాజెక్టు గురించి @SLVCinemasOffl @LegendProdOffl సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మీకు తెలియజేస్తామని, అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు, ప్రోత్సహించొద్దు అని రాసుకొచ్చారు. అయితే సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే సమాచారం అందులో లేదు. ఇక్కడ సమస్యే సినిమా మొదలుకాకపోవడం. ఆ సమాచారం లేకుండా ఇలా ఇచ్చిన క్లారిటీని ఏమనుకోవాలో టీమే చెప్పాలి. ఏదైతేనేం రెండు క్లారిటీ లేని క్లారిటీలు అయితే వచ్చాయి. అన్నట్లు క్లారిటీ అంటే గుర్తొచ్చింది. ‘రాజాసాబ్’ రిలీజ్ డేట్ మీద కొత్త డౌట్స్ మొదలయ్యాయి.