15 సంవత్సరాల క్రితం వరకు పెద్ద సినిమాలు సైతం పరిమిత సంఖ్యలో థియేటర్లలో రిలీజయ్యేవి. అందువల్ల ఆ సినిమాలకు లాంగ్ రన్ ఉండేది. ఆ సమయంలో 50 రోజులు ఆడే సెంటర్ల ఆధారంగా సినిమా రిజల్ట్ ఏంటో అభిమానులు ఫిక్స్ అయ్యేవారు. అయితే ఇప్పుడు సినిమా రిలీజైన మూడు నుంచి నాలుగు వారాలకే ఓటీటీలో ఆ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. 50 రోజుల పాటు థియేటర్లలో ఒక సినిమా ఆడటం సులువు కాదని సినీ అభిమానులు సైతం ఫీలయ్యే పరిస్థితి ఏర్పడింది.
అయితే హనుమాన్ మూవీ మాత్రం 150 సెంటర్లలో 50 రోజుల పాటు ప్రదర్శితమై అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హనుమాన్ మూవీ ఖాతాలో మరో మైల్ స్టోన్ చేరడం ఈ సినిమాకు పని చేసిన వాళ్లకు సైతం సంతోషాన్ని కలిగిస్తోంది. హనుమాన్ మూవీ సెట్ చేసిన ఈ రికార్డ్ ను ఇప్పట్లో మరో తెలుగు మూవీ బ్రేక్ చేసే అవకాశమే లేదు. ఈ నెల 8వ తేదీ నుంచి హనుమాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రచారం జరుగుతోంది.
అయితే జీ5 నుంచి మాత్రం ఇందుకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రాలేదు. థియేటర్లలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన హనుమాన్ ఓటీటీలో సైతం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. మరోవైపు జై హనుమాన్ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావడం కష్టమని సమాచారం. జై హనుమాన్ సినిమాను ప్రశాంత్ వర్మ భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు.
జై హనుమాన్ (Hanu Man) సినిమాలో నటించే ప్రధాన నటీనటుల గురించి క్లారిటీ రావాల్సి ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటీనటులు ఈ సినిమాలో భాగం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. జై హనుమాన్ సినిమా కోసం హిందీ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హనుమాన్ మూవీ సక్సెస్ తో టాలీవుడ్ స్టార్స్ సైతం డివోషనల్ టచ్ ఉన్న సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు.