తేజ సజ్జ టైటిల్ రోల్ పోషించిన ‘హనుమాన్’ సినిమా జనవరి 12న అంటే మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీని ‘ప్రైమ్ షోస్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ తో ఈ సినిమా భారీ హైప్ ను సొంతం చేసుకుంది. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వినయ్ రాయ్ విలన్ గా నటించాడు. గెటప్ శీను, సత్య, వెన్నెల కిషోర్ వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి.
సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. విజువల్స్ అదిరిపోయాయి. ఎక్కడా ల్యాగ్ అన్నది లేకుండా వెళ్లిపోయిందట. అయితే సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుందట. తర్వాత మళ్ళీ పికప్ అవుతుందని, ముఖ్యంగా క్లైమాక్స్ అదీ ఆఖరి 20 నిమిషాలు సినిమా అందరినీ మరో ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది అని అంటున్నారు.
మొత్తంగా ‘హనుమాన్’ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటుందని, కచ్చితంగా బ్లాక్ బస్టర్ సినిమా అని గట్టిగా చెబుతున్నారు. మరి మార్నింగ్ షోల నుండి టాక్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కచ్చితంగా నిర్మాతలకి భారీ లాభాలను చేకూర్చడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లాంగ్ రన్ కి కూడా అవకాశం ఉంది అని అంటున్నారు.
#Hanuman 2nd half is a bit dragged here and there but comes back well with a very good last 30 mins. The blend of super hero elements and Lord Hanuman into a commercial storyline was done very well. A few scenes are bound to give you goosebumps. Barring a few odd shots the VFX… https://t.co/oqGQWYXKmI
#Hanuman A Well Made Superhero Story told with the element of Hanuman infused!
While the 1st half is engaging throughout, the 2nd half feels a little dragged at parts but the climax more than makes up for it. Very rare do we see a concept like this and the director has…
#HanumanReview – ⭐️⭐️⭐️⭐️#Hanuman is a POWERHOUSE VISUAL SPECTACLE. Film has a REMARKABLE BLEND of Devotion, Humor emotions & action that entertains throughout the run time.Hanuman First 20 mins starts slow, post that till interval it turns out to be a non stop entertainment pic.twitter.com/dsULBX8LLM