‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగాడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత రిషబ్ శెట్టితో ‘జై హనుమాన్’ చేయాలి. కానీ దాంతో పాటు వరుసగా మరిన్ని పెద్ద ప్రాజెక్టులు సెట్ చేసుకోవాలని చూశాడు. రణ్వీర్ సింగ్ తో ఒక సినిమా ఫిక్స్ అని అనౌన్స్మెంట్ వచ్చింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మించాలి. కానీ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు రణ్వీర్ సింగ్ ఆ ప్రాజెక్టు నుండి తప్పుకోవడంతో ఆగిపోయింది. మరోపక్క బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ సినిమా ఉంటుందని ప్రకటన వచ్చింది. కానీ అది కూడా సెట్స్ పైకి వెళ్ళింది లేదు.
‘జై హనుమాన్’ అయితే 2025 సంక్రాంతికే వస్తుంది అన్నారు. కానీ ఇంకా అది ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఉంది. ఇన్ని పెండింగ్ ప్రాజెక్టుల మధ్య ప్రశాంత్ వర్మ.. ప్రభాస్ తో సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.’హోంబలే..’ సంస్థ ఈ ప్రాజెక్టుని నిర్మిస్తుందని ‘బ్రహ్మ రాక్షస్’ పేరుతో ఆ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ప్రభాస్ టీం మాత్రం ఆ ప్రాజెక్టు గురించి స్పందించింది లేదు. అధికారిక ప్రకటన కూడా ఏమీ రాలేదు. అదంతా గాసిప్ అని కూడా ప్రభాస్ టీం పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది.
అయినా సరే ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ సినిమా ఉంటుందని… ప్రశాంత్ వర్మ టీం చెబుతూనే ఉంది.ప్రభాస్ లైనప్ లో అయితే అసలు ప్రశాంత్ వర్మ సినిమానే కనిపించడం లేదు. ప్రస్తుతం అతను ‘ది రాజాసాబ్’ చేస్తూనే మరోపక్క హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా చేయాలి. అటు తర్వాత ‘కల్కి 2..’ ‘సలార్ 2’ ఉండనే ఉన్నాయి. సో ఏ రకంగా చూసుకున్నా ప్రశాంత్ వర్మతో ప్రభాస్ సినిమా లేనట్టే..! ఒకవేళ ఈ 2 ఏళ్ళలో సెట్ అయితే అవ్వొచ్చు అనుకోవాలి. ఒకవేళ సెట్ అయినా అది సెట్ అవ్వడానికి ఇంకో 2 ఏళ్ళు టైం పట్టొచ్చు.