సంక్రాంతి పండుగ కానుకగా రిలీజైన సినిమాలలో హనుమాన్, నా సామిరంగ సినిమాలు ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్నాయి. హనుమాన్ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా నా సామిరంగ సినిమాలో అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించడం గమనార్హం. ఈ ఇద్దరు హీరోయిన్లు తమ నటనతో ప్రాణం పోశారనే చెప్పాలి. హనుమాన్, నా సామిరంగ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో ఈ హీరోయిన్లకు టాలీవుడ్ డైరెక్టర్లు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
హనుమాన్, నా సామిరంగ సినిమాల కంటెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలు ఇతర రాష్ట్రాల్లో సైతం భారీ స్థాయిలో కలెక్షన్లను అందుకున్నాయి. హనుమాన్ తేజ సజ్జా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవగా నా సామిరంగ నాగార్జున వరుస ఫ్లాపులకు బ్రేకులు వేసింది. ఈ రెండు సినిమాలు పండుగకు సరైన సినిమాలు అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హనుమాన్, నా సామిరంగ సినిమాలు 2024 సంవత్సరానికి శుభారంభాన్ని ఇచ్చాయి.
గుంటూరు కారం కూడా కమర్షియల్ గా సేఫ్ ప్రాజెక్ట్ అయినా కొన్ని ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదని టాక్ ఉంది. అమృత అయ్యర్, అషికా రంగనాథ్ అభినయ ప్రధాన పాత్రలకు ప్రాణం పోస్తున్నారు. కమర్షియల్ హీరోయిన్ల కంటే టాలెంటెడ్ హీరోయిన్లకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా సినిమాల రేంజ్ కూడా అంతకంతకూ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
ఈ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగా (Hanu Man) హనుమాన్ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కుతోంది. నాగార్జున పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాలు 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించాయి.