Teja Sajja: షూటింగ్ కంప్లీట్ అవ్వకుండానే రూ.16 కోట్ల లాభాలు దక్కాయి..!

యంగ్ హీరో తేజ సజ్జా అప్ కమింగ్ మూవీ ‘హనుమాన్’ పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ట్యాలెంటెడ్ అండ్ జీనియస్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.’జాంబీ రెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబినేషన్‌లో రూపొందుతున్న రెండో చిత్రం కావడంతో ఈ ‘హనుమాన్’ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. దీనిని ఒక విజువల్ ట్రీట్ గా ప్రేక్షకులకు అందించనున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

Click Here To Watch

దీంతో షూటింగ్ కూడా పూర్తవ్వకుండానే ‘హనుమాన్’ నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకి అమ్ముడయ్యాయి. ‘హనుమాన్’ కు ఈ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. విచిత్రం ఏంటంటే హిందీ హక్కులు ఇప్పటికే అమ్ముడైపోయాయి.తెలుగు శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను ‘జీ గ్రూప్’ సొంతం చేసుకుంది. హిందీ హక్కులు రూ. 5 కోట్లకు అమ్ముడవగా, తెలుగు శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఏకంగా రూ. 11 కోట్లకు అమ్ముడయ్యాయి.

కేవలం రెండు భాషలకే నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలో… రూ.16 కోట్లను రాబట్టింది ‘హనుమాన్’. ఇక ఈ చిత్రంలో తేజ సజ్జా ఓ సూపర్‌హీరోగా కనిపించనున్నాడు.అతని మేకోవర్ మునుపటి కంటే విభిన్నంగా కనిపిస్తుంది. ‘హనుమాన్’ కు వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుందట. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్’ వారితో కలిసి శ్రీమతి చైతన్య సమర్పణలో కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.

అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్ మరియు కృష్ణ సౌరభ్ వంటి నలుగురు సంగీత దర్శకులు ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్‌ లు సమకూరుస్తుండడం విశేషం.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus