సర్రియల్ కామెడీ జోనర్ లో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ బర్త్ డే’. “మత్తువదలరా” చిత్రంతో దర్శకుడిగా తన టాలెంట్ తో ఆకట్టుకున్న రితేష్ రాణా దర్శకత్వంలో ‘క్లాప్ ఎంటర్టైన్మెంట్’, ‘మైత్రీ మూవీ మేకర్స్’ బ్యానర్ల పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ చిత్రం జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి మొదటి రోజు పర్వాలేదు అనిపించే టాక్ ను రాబట్టుకుంది.
‘మైత్రి’ వంటి బడా నిర్మాతలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్న సినిమా కావడంతో మొదటిరోజు ఈ చిత్రం 200 కి పైగా థియేటర్లలో రన్ అయ్యింది. మొదటి రోజు ఈ చిత్రం పర్వాలేదు అనిపించే విధంగా కలెక్ట్ చేసింది.ఊహించని విధంగా రెండో రోజు కూడా బాగా హోల్డ్ చేసింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
0.14 cr
సీడెడ్
0.08 cr
ఉత్తరాంధ్ర
0.09 cr
ఈస్ట్
0.06 cr
వెస్ట్
0.04 cr
గుంటూరు
0.07 cr
కృష్ణా
0.08 cr
నెల్లూరు
0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
0.60 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.04 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
0.64 cr
‘హ్యాపీ బర్త్ డే’ చిత్రాన్ని చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. అయినప్పటికీ ఈ చిత్రం రూ.1.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.64 కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించింది.పోటీగా క్రేజ్ ఉన్న సినిమాలు ఏమీ లేకపోవడం అలాగే ‘మత్తు వదలరా’ సినిమాకి ఉన్న ఫ్యాన్స్ వల్ల ఈ మూవీ మొదటి రెండు రోజులు పర్వాలేదు అనిపించే విధంగా ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఆదివారం ఈ మూవీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.