అసభ్యకర మెసేజ్‌లతో వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన నటి..!

నటీమణులకు వేధింపులు అనేవి కొత్త కాదు. వీటి గురించి అందరూ వింటున్నవే..! అయితే ఒకప్పటిలా వారు ఇప్పుడు భరిస్తూ కూర్చోవాల్సిన పనిలేదు. ‘మీటూ’ వంటి ఉద్యమాలు ఊపందుకున్నాక.. వాళ్ళకి స్వేచ్ఛ ఏర్పడింది. అయితే వీటిని కొంతమంది దుర్వినియోగపరుచుకుంటున్నట్టు కూడా టాక్ ఎక్కువగానే వినిపిస్తుంది. అసలు మేటర్లోకి వెళితే.. ఓ వ్యక్తి తనతో సహజీవనం చేయాలని ఓ నటి పై ఒత్తిడి చేస్తున్నాడట. ఆ నటి దగ్గర ఇతను అప్పు కూడా చేసినట్లు ఆమె తెలిపింది.

తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోగా ఇలా వేధిస్తున్నాడు అంటూ ఆ నటి పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్ లోని అమీర్‌పేట్, నాగార్జునా నగర్‌ కాలనీలో ఉంటున్న ఆ నటి వయసు 42 ఏళ్ళు. తన ఫ్యామిలీ ఫ్రెండ్‌ అయిన ప్రవీణ్‌ అనే వ్యక్తి ఈమెకు 8 ఏళ్లుగా పరిచయం. అతను భవనాలు నిర్మించే బిల్డర్‌ అని తెలుస్తుంది. 8 ఏళ్ల క్రితం ఈ నటి వద్ద అతను రూ. 47 లక్షలు అప్పుగా తీసుకున్నాడట.

అపార్ట్‌మెంట్‌లో ఉండే మరో మహిళ వద్ద నుండి అప్పు తీసుకుని మరీ ఆ నటి ప్రవీణ్‌కు అప్పు ఇచ్చిందట. డబ్బులు తీసుకుని చాలా కాలం అయ్యింది దయచేసి తిరిగిమ్మని అతనికి ఈమె ఫోన్లు చేసి అడుగుతుంటే.. తనకు ఉపపత్నిగా ఉండమని అతను అసభ్యకరమైన మెసేజ్‌లు వంటివి పంపుతున్నాడట.

అందుకే ఆ నటి పోలీసులను ఆశ్రయించింది. అయితే నిందితుడు ఆరోపణలు వేరుగా ఉన్నాయి. ఈ నటి అతన్ని నమ్మించి మోసం చేసింది అని అతను చెబుతున్నాడు. పోలీసులు ఈ విషయం పై విచారణ చేపట్టారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus