Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ .. ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగ‌ర్ల‌మూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ గురించి ఏదో ఒక రూమర్ వచ్చినప్పుడల్లా టైం చూసుకుని ఓ అప్డేట్ వదులుతూ వస్తుంది చిత్ర బృందం. అంతే తప్ప ఇప్పటికీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ అయ్యింది లేదు.నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘మెగా సూర్యా ప్రొడ‌క్షన్’ బ్యాన‌ర్‌పై దయాకర్ రావు నిర్మిస్తున్నారు.ఎ.ఎం. ర‌త్నం సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది అంటూ మరోమారు ప్రచారం మొదలైన నేపథ్యంలో రేపు(సెప్టెంబర్ 2న) పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ చిన్న గ్లింప్స్ ను ఇచ్చి ఆ పుకార్లకు చెక్ పెట్టాలని చిత్ర బృందం డిసైడ్ అయ్యింది.

ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితం ఓ పవర్ ఫుల్ పోస్టర్ ను కూడా విడుదల చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ‘స్వాగతిస్తుంది సమరపథం..దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం…’ అంటూ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ నుండి ఈ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. అలాగే రేపు సెప్టెంబర్ 2, సాయంత్రం గం: 5.45 నిమిషాలకు ‘పవర్ గ్లాన్స్’ పేరుతో ఆ పవర్ ఫుల్ గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నారు. 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్య‌ద్భుత‌మైన విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు క్రిష్.

ఇది ఒక లెజండ‌రీ బందిపోటు వీరోచిత గాథ అని తెలుస్తుంది. ఇండియా సినిమాల్లో ఇప్ప‌టివరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్ ఇదని కూడా సమాచారం. ఇప్పటికే 50 శాతం పూర్త‌యిందట. త్వరలో చిత్రం నూతన షెడ్యూల్ ప్రారంభం కానుందని నిర్మాత‌ ఎ.ద‌యాక‌ర్ రావు తెలియజేశారు.ఎం.ఎం. కీర‌వాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రూపొందుతుంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus