Hari Hara Veeramallu: రిలీజ్‌ డేట్‌ మార్చం అంటున్న ఏఎంరత్నం

క్రిష్‌ను అందరూ సూపర్‌ఫాస్ట్‌ దర్శకుడు అంటుంటారు. కారణం ఎంత కాంప్లికేటెడ్‌ సినిమానైనా కూల్‌గా డీల్ చేసి వీలైనంత త్వరగా షూటింగ్‌ ముగించి, రిలీజ్‌ చేసేస్తుంటాడు. గతంలో చాలా సినిమాల విషయంలో ఆయన ఇలానే చేశారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లాంటి హిస్టారికల్‌ సినిమాను కూడా సుమారు 70 రోజుల్లో పూర్తి చేసి వావ్‌ అనిపించాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే… క్రిష్‌ మరోసారి తన స్పీడ్‌కు పని పెట్టాల్సి వచ్చేలా ఉంది కాబట్టి. పవన్ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ అనే సినిమా తెరకెక్కుతోంది.

ఇటీవల టైటిల్‌ను రివీల్‌ చేస్తూ ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. మీరు చూసే ఉంటారు. పవన్‌ కల్యాణ్‌ను చాలా కొత్తగా చూపించారు క్రిష్‌. అయితే పవన్‌ పొలిటికల్‌ మీటింగ్‌లకు హాజరు కావడం లాంటి కార్యక్రమాలకు సినిమా షూటింగ్‌కి చిన్న గ్యాప్‌ వచ్చింది. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ రావడం, పవన్‌కు కరోనా సోకడంతో సినిమాకు పెద్ద గ్యాప్‌ వచ్చినట్లు అయింది. దీంతో ఇప్పుడు సినిమా ముందుగా చెప్పినట్లు వచ్చే ఏడాది సంక్రాంతికి స్తుందా అనే సందేహం నెలకొంది. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమా సంక్రాంతికి తెస్తామని సినిమా నిర్మాత ఏఎం రత్నం చెబుతున్నారు.

సంక్రాంతి రిలీజ్‌ అంటే ఇంకా చాలా సమయం ఉంది. ఈలోగా చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు చేసేస్తాం. కరోనా పరిస్థితులు కుదురుకొని షూటింగ్స్‌ మొదలైతే వేగంగా పూర్తి చేసేయొచ్చు అని నిర్మాత చెబుతున్నారు. ఇక్కడే క్రిష్‌ ట్రాక్‌ రికార్డు లైన్‌లోకి వచ్చింది. వేగంగా సినిమాలు పూర్తి చేయడంలో క్రిష్‌ దిట్ట అని ముందే అనుకున్నాం కదా. ఆ జోరు మళ్లీ చూపించి వచ్చే సంక్రాంతికి ‘హరి హర వీరమల్లు’ రెడీ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. అభిమానుల ఆశ క్రిష్‌ తీరుస్తారు అనుకోండి.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus