పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం నిన్న జూన్ 24న రిలీజ్ అయ్యింది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘మెగా సూర్య ప్రొడక్షన్స్’ బ్యానర్ పై దయాకర్ రావు నిర్మించగా ఏ.ఎం.రత్నం సమర్పకులుగా వ్యవహరించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ వంటివి సినిమాకి హైప్ పెంచాయి.
పవన్ కళ్యాణ్ చేసిన మొదటి పాన్ ఇండియా మరియు పీరియాడిక్ మూవీ కాబట్టి.. టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 10.36 cr |
సీడెడ్ | 5.8 cr |
ఉత్తరాంధ్ర | 4.6 cr |
ఈస్ట్ | 3.54 cr |
వెస్ట్ | 2.78 cr |
గుంటూరు | 3.5 cr |
కృష్ణా | 2.65 cr |
నెల్లూరు | 1.25 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 34.48 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.5 cr |
ఓవర్సీస్ | 4.85 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 41.83 (షేర్) |
‘హరిహర వీరమల్లు’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.121 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు రూ.41.83 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.68.6 కోట్లు గ్రాస్ ను కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.79.17 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో రోజుకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉండటం విశేషంగా చెప్పుకోవాలి.