జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar), డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మొదట భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను ప్రకటించగా ఆ తర్వాత ఈ టైటిల్ ను ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) గా మార్చారు. అయితే ఈ సినిమా టైటిల్ ను మార్చడం వెనుక కారణాలు తాజాగా వెల్లడయ్యాయి. అభిమానుల వల్లే ఈ సినిమా టైటిల్ మార్చామని హరీష్ శంకర్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.
భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను ప్రకటించిన సమయంలో చాలామందికి ఆ టైటిల్ సరిగ్గా అర్థం కాలేదని హరీష్ శంకర్ తెలిపారు. భగత్ సింగ్ అంటే ఒక విస్ఫోటనం అని ఆయన పేర్కొన్నారు. భవదీయుడులో ఒక వినయం భగత్ సింగ్ లో ఒక విస్ఫోటనం ఉందని పవన్ కళ్యాణ్ సైతం టైటిల్ బాగుందని ఫిక్స్ చేయాలని సూచనలు చేశారని హరీష్ శంకర్ వెల్లడించడం జరిగింది.
అయితే భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ చాలామందికి కనెక్ట్ కాలేదని ఆ తర్వాత కథ కూడా మారిందని హరీష్ శంకర్ పేర్కొన్నారు. సినిమాలో హీరో పాత్ర మాత్రం అలాగే ఉంటుందని ఆయన వెల్లడించారు. ఆ భగత్ సింగ్ దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడని అవసరమైతే ఈ భగత్ సింగ్ దేశం కోసం ప్రాణం తీస్తాడని ఆయన పేర్కొన్నారు. ఈరోజుల్లో అలాంటి భగత్ సింగ్ కాకుండా ఇలా ఉండాలనే మెసేజ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ పెట్టామని ఆయన తెలిపారు.
భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ మార్పు వెనుక అసలు విషయం తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్ గురించి కూడా హరీష్ శంకర్ రియాక్ట్ అయ్యారు. వివరణాత్మక, నిర్మాణాత్మక విమర్శలను నేను స్వాగతిస్తానని ఆయన పేర్కొన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ను దూషిస్తూ చేసే కామెంట్ల విషయంలో మాత్రం నేను సీరియస్ అవుతానని హరీష్ శంకర్ వెల్లడించడం గమనార్హం.