‘భవదీయుడు భగత్ సింగ్’ గుర్తున్నాడా? అవును గుర్తున్నాడు.. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) అయిపోయాడు కదా అంటారా! అవును నిజమే.. ఇప్పుడు ఈ సినిమాలో మళ్లీ మార్పు వచ్చింది. ఈ సారి వచ్చిన మార్పు మొత్తం లెక్కలు మార్చేసేది అని చెబుతున్నారు. ఎందుకంటే కథకు అత్యంత కీలకమైన కథ కాబట్టి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కథ మారిపోయింది. గతంలో తమిళ సినిమా ‘తెరి’ (Theri) మెయిన్ పాయింట్‌ను తీసుకొని.. ఫస్టాఫ్ బ్యాక్‌డ్రాప్ మార్చి సిద్ధం చేశారు. ఇప్పుడు ఏకంగా కొత్త కథనే సిద్ధం చేసుకున్నారట.
గత సినిమా ప్రభావమో, గ్యాప్ చాలా దొరికింది కాబట్టి సిద్ధం చేసుకున్నారో లేక పాత ‘భవదీయుడు..’నే మళ్లీ ముందుకు తెచ్చారో కానీ ఇప్పుడు కథ ఓనర్ హరీశ్ శంకరే (Harish Shankar) . త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభం అంటూ ఓ పోస్టర్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. అందులో అనూహ్యంగా హరీశ్ శంకర్ పేరు మీద ఉన్న విభాగాల్లో కథ కూడా వచ్చి చేరింది. అంటే కథను ఆయన టీమ్ సిద్ధం చేశారు అని చెప్పాలి. మరి ఇది ముందు అనుకున్న కథనా, లేక ‘మిస్టర్ బచ్చన్’ (Mr-Bachchan) సినిమా ఎఫెక్ట్ తర్వాత హరీశ్ సిద్ధం చేసుకున్న కొత్త కథనో తెలియాల్సి ఉంది.
గత ఏడాదిగా ప్రభుత్వ కార్యకలాపాల్లో సీరియస్‌గా ఉన్న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు సినిమాలకు అవకాశం ఇచ్చారు. ఓవైపు ‘హరిహర వీరమల్లు 1’ (Hari Hara Veera Mallu) సినిమా విడుదలకు సిద్ధం అవుతుండగా.. ఈ రోజో, రేపో ‘ఓజీ’ (OG Movie)సినిమా సెట్స్‌లో అడుగుపెడతారు అని పవన్ సన్నిహితుల సమాచారం. ఆ వెంటనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రారంభిస్తారు అని సమాచారం. అందుకే మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ త్వరలో షూటింగ్ ప్రారంభం అనే పోస్టర్‌ను రిలీజ్ చేసింది అని చెబుతున్నారు.
‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) సినిమాకు ఎన్ని మార్పులు చేసినా కూడా కథ విషయంలో ఒరిజినల్ రైటర్‌కే క్రెడిట్ ఇచ్చారు. మాటలు, మార్పులు, దర్శకత్వం అని క్రెడిట్ వేసుకున్నారు హరీష్. ఇప్పుడు ‘తెరి’ కథనే తీసుకొని ఉంటే కచ్చితంగా ఇలాంటి క్రెడిట్సే ఇచ్చేవారు. అలా కాకుండా కథ అని రాసుకున్నారు అంటే కొత్త కథనే తీసుకున్నారు అని చెప్పాలి. అయితే హరీశ్ శంకర్ (Harish Shankar) – పవన్ సినిమా కోసం ఓ కథను సిద్ధం చేసే టీమ్‌లో పని చేశా అని దర్శకుడు దశరథ్ గతంలో చెప్పారు.