ఇంకా మొదలు కాని, ఎప్పుడు మొదలవుతుందో తెలియని ‘స్పిరిట్’(Spirit) సినిమా నుండి దీపికా పడుకొణెను (Deepika Padukone) తప్పించేశారు అంటూ గత కొన్ని రోజులుగా తెలుగు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. మరోవైపు ఇదే సమయంలో వెయిటింగ్ గేమ్ నచ్చక దీపిక తప్పుకుందని చెబుతున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) , హీరోయిన్ దీపిక పడుకొణె యాటిట్యూడ్ గురించి తెలిసినవాళ్లు అయితే రెండూ జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే యాటిట్యూడ్ విషయంలో, సినిమా మేకింగ్ విషయంలో ఇద్దరూ ఒక్కటే.
అయితే, ఇక్కడ పాయింట్ అది కాదు.. దీపిక ఆ సినిమాకు నో చెప్పి, అల్లు అర్జున్ (Allu Arjun) సినిమాకు ఓకే చెప్పింది అనే ఇన్‌స్టంట్ పుకారే. ‘స్పిరిట్’కి ఆమె నో చెప్పి అట్లీ (Atlee Kumar) – అల్లు అర్జున్ సినిమాను ఓకే చేసింది అని అంటున్నారు. ఈ ఏడాది ఆఖరులో మొదలవుతుంది అని చెబుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. ఇంకా కాస్టింగ్ వరకు వెళ్లలేదు అనేది టాలీవుడ్ వర్గాల సమాచారం. కానీ ఆమె ఈ సినిమాకు ఓకే చెప్పింది అని దీపిక గురించి చెబుతున్నారు.
ఇక్కడే రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి ఈ సినిమా ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు. అంతమంది మధ్యలో దీపిక నటించడం అంటే ఆమె గురించి తెలిసినవాళ్లు నమ్మరు. ఇక రెండో విషయం ఆమె ‘స్పిరిట్’కి పెట్టింది అంటున్న కండిషన్లు ఈ సినిమాకు కూడా పెడుతుంది. మరి ఈ సినిమా టీమ్ వాటికి ఓకే చెప్పింది. భారీ రెమ్యూనరేషన్, పని గంటలు తగ్గింపు లాంటివి ఇక్కడ అట్లీ, అల్లు అర్జున్, సన్ పిక్చర్స్ వాళ్లు ఓకే చేశారా అనేదే డౌట్.
ఏ మాత్రం సాధ్యం కాదు అని సందీప్ రెడ్డి వంగా బలంగా చెప్పి బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ వాళ్లను ఒప్పించారని చెబుతున్నారు. మరి బాలీవుడ్ సినిమాకు కూడా సౌత్ హీరోయిన్లను ఎంచుకునే అట్లీ (Atlee).. దీపికను తీసుకుంటారా? అనేదే ప్రశ్న. ఒకవేళ అదే జరిగితే సందీప్‌కి ఉన్న నో చెప్పే ధైర్యం.. అట్లీకి లేదనే చెప్పాలి. ఇక మరో పాయింట్ ఏంటంటే.. పైన చెప్పిన ఐదుగురు హీరోయిన్ల కాన్సెప్ట్‌లో ఇప్పటివరకు దీపిక, మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) , జాన్వీ కపూర్(Janhvi Kapoor) , భాగ్యశ్రీ భోర్సే (Bhagyashree Borse) , కేతిక శర్మ (Ketika Sharma) ఓకే అయ్యారు అని అంటున్నారు.