పవన్ కల్యాణ్‌తో (Pawan Kalyan) ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) వంటి మాస్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ (Harish Shankar) , ఆ తర్వాత తన కెరీర్‌లో మళ్లీ అదే స్థాయి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రాజెక్ట్ ద్వారా మరోసారి పవన్‌తో జోడీ కట్టినా, ఆ సినిమా పలు కారణాలతో ముందుకు సాగలేకపోయింది. పవన్ రాజకీయ బిజీ షెడ్యూల్ కారణంగా షూటింగ్ రద్దవుతూ రావడం, హరీష్ శంకర్‌కు నిరుత్సాహం కలిగించింది. ఇక రవితేజతో (Ravi Teja) చేసిన మిస్టర్ బచ్చన్ (Mr-Bachchan) దారుణంగా డిజాస్టర్ అయ్యింది. దీంతో నెక్స్ట్ పవర్ఫుల్ కంటెంట్ తో రావాలని నిర్ణయించుకున్నాడు.
ప్రస్తుతం హరీష్ శంకర్ బలమైన మాస్ కథతో రెడీ అవుతున్నాడు. ఇందులో హీరోగా నందమూరి బాలకృష్ణను (Nandamuri Balakrishna) ఎంచుకున్నట్టు సమాచారం. బాలయ్యకు సెట్టయ్యేలా మాస్ మేడ్ క్యారెక్టర్ డిజైన్ చేశారట. హీరో క్యారెక్టర్ లో రెండు డిఫరెంట్ షేడ్స్ కూడా ఉంటాయని టాక్. అభిమానులు మెచ్చేలా, బాలయ్య ఎనర్జీకి తగ్గట్టుగా పవర్‌ఫుల్ మాస్ డైలాగులు, యాక్షన్ బ్లాక్‌లు సెట్ చేస్తున్నాడట. ఇది కేవలం ఓ మాస్ మూవీ మాత్రమే కాకుండా, బాలయ్య క్యారెక్టర్ ఓ ఎమోషనల్ డెప్త్‌తో కూడిన క్యారెక్టర్‌గా ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ చిత్రాన్ని కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ప్రస్తుతం ఈ బ్యానర్ విజయ్‌తో (Vijay Thalapathy) ‘జన నాయకన్’ (Jana Nayagan), యష్‌తో (Yash) ‘టాక్సిక్’ (Toxic), కార్తితో (Karthi) ‘ఖైదీ 2’ వంటి భారీ ప్రాజెక్ట్స్‌ను నిర్మిస్తోంది. ఇప్పుడు బాలయ్యతో హరీష్ శంకర్ ప్రాజెక్ట్‌ను కూడా లైన్‌లో పెట్టి, పాన్ ఇండియా స్థాయిలో రూపొందించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే హరీష్ శంకర్ రామ్‌తో (Ram) కూడా ఒక యాక్షన్ మూవీ చేయబోతున్నాడు. దీంతో పాటు బాలయ్య సినిమా కూడా ఒకేసారి ప్లాన్ చేసుకుంటూ కెరీర్‌లో మళ్లీ జోష్ చూపించాలన్న ఉద్దేశంతో ఉన్నాడు. హరీష్ దర్శకత్వంలో బాలయ్య కనిపిస్తే ఓ డిఫరెంట్ మాస్ ఫెస్ట్ ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. తప్పకుండా ఈ కాంబినేషన్ ప్రేక్షకులలో ఆసక్తిని రేపనుంది. హరీష్ శంకర్ తన మాస్ మేజిక్‌తో, బాలయ్య తన ఎనర్జీతో కలిస్తే.. బాక్సాఫీస్ దగ్గర మరో హిట్ ఖాయం అని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఆఫిషియల్‌గా అనౌన్స్ అవుతుందో, ఏ టైటిల్‌తో వస్తుందో వేచి చూడాలి.