మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ (Kannappa సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మంచు విష్ణు హీరోగా నటించడంతో పాటు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కథ విభాగంలో కూడా ఆయన పేరు వేసుకున్నారు. మోహన్ లాల్ (Mohanlal) , శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) , శరత్ కుమార్(Sarathkumar), అక్షయ్ కుమార్ (Akshay Kumar) వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. వీళ్ళందరూ ఎలా ఉన్నా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో రుద్ర అనే పాత్ర పోషిస్తున్నారు.
టీజర్లో కూడా ప్రభాస్ ను (Prabhas) హైలెట్ చేసిన సంగతి తెలిసిందే.ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని.. వాస్తవానికైతే ఏప్రిల్ 25 నే రిలీజ్ చేయాలని విష్ణు అండ్ టీం ప్లాన్ చేసింది. కానీ వి.ఎఫ్.ఎక్స్ టీం సకాలంలో కాపీ ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో వాయిదా వేసింది. అయితే సమ్మర్ ను మిస్ చేసుకోవడం అనేది ‘కన్నప్ప’ టీం బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఎందుకంటే సెలవుల టైంలో ఈ సినిమాని చూడటానికి ఫ్యామిలీ ఆడియన్స్ కదిలి వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాగు వస్తారు. వాళ్ళ రూపంలో సినిమాకి 30 శాతం థియేట్రికల్ రెవెన్యూ ఈజీగానే వచ్చేస్తుంది. ఏ సీజన్లో అయినా ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా చూడటానికి వస్తారు. కానీ వాళ్ళ పుషింగ్ వల్ల సమ్మర్లో ‘కన్నప్ప’ కి మైలేజ్ వచ్చేది. అందుకే సమ్మర్ మిస్ అయితే ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు.
ఇదిలా ఉండగా.. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ‘కన్నప్ప’ సినిమాని జూన్ 27న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అదే డేట్ కి గత ఏడాది ప్రభాస్ ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) వచ్చి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.