ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అని అంటుంటారు మన సినిమావాళ్లు. అయితే ఆ మాట చెప్పడం, అందుకు తగ్గట్టుగా, శరీరాన్ని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. వయసుతోపాటు వచ్చే ఎన్నో మార్పులు వస్తుంటాయి. వాటిని తన డైట్, కసరత్తులతో మెయింటైన్ చేస్తుంటారు. సినిమా హీరో అన్నాక… ఇలాంటివన్నీ సహజం అంటారా. నిజమే.. కానీ అలా ఉండటం, చేయడం చాలా కష్టం. మరి మెగాస్టార్ చిరంజీవి ఏం చేస్తున్నారు. 66 ఏళ్ల వయసులో ఆయన ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటున్నారో చూద్దాం.
* చిరంజీవి రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్తుంటారు . ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా, పాత్రకు తగ్గట్టు తనను తాను మలచుకుకోవడానికి వ్యాయమాం తప్పనిసరి అని చెబుతుంటారు.
* షూటింగ్‌లు ఉన్నప్పుడు రోజూ ఉదయం ఏడు గంటలకే చిరంజీవి సెట్స్‌కి వెళతారట. దాని కోసం ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి ఆరు వరకు వ్యాయామం చేస్తారట. ఆ తర్వాత రెడీ అయ్యి స్పాట్‌కు వెళ్తారట.
* హీరోలన్నాక యాక్షన్ సన్నివేశాలు పక్కాగా ఉంటాయి. అందులోనూ మాస్ హీరో కదా ఇంకా ఎక్కువే ఉంటాయి. దీనికి మంచి పర్సనాలిటీ కచ్చితంగా ఉండాలి.
* వయసు అనే విషయాన్ని మనసులోకి తీసుకోకుండా… నమ్మకంతో ఫిట్‌గా ఉండాలి. అప్పుడే పనులు చక చకా పూర్తవుతాయి అని చెబుతుంటారు చిరు.
* మనిషి ఆరోగ్యం అంటే… ఫిజికల్ ఫిట్‌నెస్ ఎంత ముఖ్యమో, మానసికంగానూ ఆరోగ్యమూ అంతే ముఖ్యమంటుంటారు చిరంజీవి. అందుకే వీలైనంత మేరకు మానసిక ప్రశాంతత ఉండేలా చూసుకుంటారట.
* ఒత్తికి గురి చేసే విషయాలకు దూరంగా ఉంటుంటారు. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు ముఖంలో కనిపిస్తుంది అని చెబుతుంటారాయన. యాక్టర్ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ తేడా కొడితే ఇబ్బందే కదా.
* డైట్ విషయంలో చిరంజీవి బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కలిపి ఉండేలా చూసుకుంటారట. ప్రొటీన్స్ బలంగా ఉండే ఆహారంతో పాటు, సలాడ్, సూప్స్‌ను ఎక్కువగా తీసకుంటుంటా అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు చిరు.
* ఆహారం విషయంలో ఇంటి ఫుడ్‌కే ఓటేస్తారు చిరు. బయట ఫుడ్ కంటే ఇంటి ఆహారమే బెస్ట్ అని చెబుతుంటారు. అలాగే ఫుడ్ హ్యాబిట్స్ మార్చడంలో చిరంజీవి దిట్ట. దాని వల్లే పాత్ర కోసం బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా చిరంజీవి చాలా ఈజీ అని చెబుతుంటారు.