సినిమాలు అన్నాక హిట్లు ఉంటాయి, ఫ్లాప్‌లు ఉంటాయి. కానీ అదేంటో కొంతమంది దర్శకులకు కేవలం హిట్లు మాత్రమే ఉంటాయి. ఏ సినిమా చేసినా, ఏ హీరోతో చేసినా, ఏ టైమ్‌లో చేసినా.. సీజన్‌తో, పర్సన్‌తో, కంటెంట్‌తో సంబంధం లేకుండా హిట్ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా ఇలాంటి ఫామ్‌నే కంటిన్యూ చేశారు దర్శకుడు అట్లీ.
షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ సినిమా చేసిన అట్లీ (Atlee) … తనకు అలవాటు అయిన రీతిలో విజయం సాధించేశాడు. అయితే ఇలాంటి దర్శకులు మన దగ్గర ఇంకొంతమంది ఉన్నారు. వాళ్లెవరో వాళ్ల సంగతేంటో చూద్దాం.
* భారతీయ సినిమా పరిశ్రమను, అందులోనూ సౌత్ సినిమా ఇండస్ట్రీ ఘనతను ప్రపంచవ్యాప్తం చేసిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పటివరకు జక్కన్న 12 సినిమాలు తీయగా… అన్నీ విజయాలే. 13వ సినిమా మహేష్‌బాబుదే.
* కామెడీ సినిమాలు, కాస్త యాక్షన్ కలగలిపి సినిమాలు తీయడంలో అనిల్ రావిపూడి దిట్ట అని చెప్పొచ్చు. ఆరు సినిమాలు ఆయన నుండి రాగా, అన్నీ విజయాలే. ఇప్పుడు ఆరో సినిమా ‘భగవంత్ కేసరి’.
* తమిళంలో ఇలాంటి అపజయమెరుగని దర్శకుల్లో హెచ్ వినోద్ ఒకరు. ఐదు సినిమాలు చేసిన వినోద్ అన్నింటితో విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఆరో సినిమాను కమల్ హాసన్‌తో చేస్తున్నారు.
* సౌత్‌లో ఇలాంటి మరో స్టార్ డైరక్టర్ లోకేశ్ కనగరాజ్. ఆయన కూడా ఐదు సినిమాలతో అదరగొట్టాడు. ఇప్పుడు ఆరో సినిమా విజయ్‌తో ‘లియో’గా చేస్తున్నాడు.
* కన్నడ నాట ఇలాంటి ఫీట్ సాధించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ‘ఉగ్రం’ సినిమాతో వచ్చిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ‘కేజీయఫ్’లో పాన్ ఇండియా డైరక్టర్ అయ్యారు. త్వరలో ‘సలార్’తో రాబోతున్నారు.
* శాండిల్ వుడ్‌లో ఇదే తరహాలో విజయం అందుకుంటున్న మరో దర్శకుడు సంతోష్ ఆనంద్ రామ్. మూడు సినిమాలు తీసి మూడింటితో విజయం అందించారు. అలాగే చేతన్ కుమార్ నాలుగు సినిమాల్లోనూ విజయం అందుకున్నారు.
వీళ్లు సౌత్ దర్శకుల జాబితాలో ఉన్నవారు. నార్త్‌తో కలిపితే ఇలాంటి వాళ్లు మరికొంతమంది వస్తారు.
జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!