Yash, Shah Rukh Khan: మరో క్రేజీ కాంబినేషన్‌… క్లారిటీ ఇచ్చేసిన యశ్‌… ఏం చెప్పాడంటే?

‘కేజీయఫ్‌’ సినిమాల తర్వాత యశ్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. సగటు హీరోలా ఆలోచిస్తే కుదరదు అని అనుకున్నాడో, లేక వరుస షూటింగ్‌ల నుండి విరామం అనుకున్నాడో కానీ చాలా రోజుల గ్యాప్‌ తీసుకున్నాడు. కొత్త సినిమా గురించి వరుస పుకార్లు వచ్చినా ఎక్కడా క్లారిటీ రాలేదు. సినిమా ఎప్పుడు అని అభిమానులు ఎదురు చూసి ఎదురు చూశాక ఎట్టకేలక గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని యశ్‌ ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్‌ హ్యాపీ. అయితే ఆ తర్వాత మరో ప్రశ్న మొదలైంది.

చాలా రోజులుగా ఈ ప్రశ్న కూడా వినిపిస్తూ వచ్చింది. దీనిపై క్లారిటీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి ఇప్పుడు స్పష్టత ఇచ్చేశారు. ఆ ప్రశ్నే యశ్‌ కొత్త సినిమాలో షారుఖ్‌ ఖాన్‌ నటిస్తున్నాడని. ఈ పుకారు ఎలా వచ్చింది, అసలు ఈ ఇద్దరు కాంబినేషన్‌ ఎలా చర్చల్లోకి వచ్చిందో తెలియదు కానీ… వార్తలు అయితే గుప్పుమన్నాయి. కానీ అలాంటి ఆలోచనే లేదు అని యశ్‌ క్లారిటీ ఇచ్చాడు . ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో యశ్‌ మాట్లాడాడు. దీంతో ఫ్యాన్స్‌కి ఓ క్లారిటీ వచ్చేసింది.

కన్నడ రాకింగ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న యష్ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబినేషన్‌లో ‘టాక్సిక్’ అనే పాన్‌ ఇండియా సినిమాను అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. పేరుకు తగ్గట్టే ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుందని సమాచారం. ఈ క్రమంలో పాన్‌ ఇండియా రేంజిలో నటీనటుల్ని తీసుకుంటారు అని అన్నారు. ఈ క్రమంలో షారుఖ్‌ ఖాన్‌ ఈ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తాడు అని వార్తలొచ్చాయి.

అయితే యష్ (Yash) మాట్లాడుతూ.. ఈ రూమర్స్‌లో ఎలాంటి నిజం లేదని… తమ నుండి అధికారికంగా న్యూస్ వచ్చేవరకు ఏదీ నమ్మొద్దని తేల్చి చెప్పాడు. అయితే ఆ సినిమాలో ఓ అతిథి పాత్ర అయితే ఉందని, అది స్టార్‌ హీరో చేస్తేనే బాగుంటుందని సమాచారం. అయితే ఎవరు అనే క్లారిటీ వచ్చేంతవరకు టీమ్‌ ఆగుతోందట.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus