Sekhar Kammula: ‘లవ్‌స్టోరీ’ పాటలు హిట్ అవ్వడానికి కారణమిదేనట!
- October 4, 2021 / 01:20 PM ISTByFilmy Focus
శేఖర్ కమ్ముల సినిమాల్లో పాటలు చాలా బాగుంటాయి. అంత మంచి మ్యూజిక్ సెన్స్ ఎలా అలవడిందో… ఈ డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా? ఆయన సినిమాలను క్లోజ్‌గా ఫాలో అయ్యేవారికి ఈ విషయం బాగా తెలుస్తుంది. తనతో పని చేసే కొత్త మ్యూజిక్ డైరక్టర్లతో ఎలా శేఖర్ కమ్ముల ఎలా అంత బాగా సంగీతం చేయించుకుంటారో అనే డౌట్ వస్తుంది కూడా. దీనిని ‘లవ్ స్టోరీ’ మ్యూజిక్ డైరక్టర్ పవన్ సమాధానం చెప్పేశాడు.
శేఖర్ కమ్ములకు సంగీతమంటే చాలా ఇష్టమట. ప్రపంచ సంగీతంలో కొత్త పాట వస్తే చాలు తప్పకుండా వింటారట. అంతేకాదు పాత కాలం నాటి పాటలన్నా ఆయనకు చాలా ఇష్టమట. అలనాటి భానుమతిగారి నుండి నేటి లేడీ గాగా వరకు ప్రపంచంలో వచ్చే ప్రతి పాటనూ వింటారట శేఖర్ కమ్ముల. ఈ విషయాన్ని పవన్ ఇటీవల చెప్పుకొచ్చారు. అంతేకాదు శేఖర్ కమ్ముల చక్కగా పాడతారు కూడా. ప్రపంచ సంగీతంపై అంత పట్టుంది కాబట్టే శేఖర్ కమ్ముల చక్కటి పాటలు చేయించుకుంటుంటారట.

‘లవ్ స్టోరీ’లోని పాటలు సూపర్‌హిట్ అయ్యాయంటే… అందులో సగం క్రెడిట్టే తనది అయితే… మిగతాదంతా శేఖర్ కమ్ములదే అని చెప్పారు పవన్. ఓహో… ఇదన్నమాట శేఖర్ కమ్ముల పాటల హిట్ వెనుక కథ.
రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!











