‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతోన్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లో నిలిచేవారు. కొన్నిరోజుల క్రితం వరకు ప్రకాష్ రాజ్ గెలుస్తాడేమోనని అందరూ అనుకున్నారు. ఆ తరువాత మంచు విష్ణు పుంజుకున్నాడు. దీంతో ఇద్దరిలో ఎవరు గెలుస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఆదివారం నాడు ఉదయం 8 గంటల నుంచి ‘మా’ ఎన్నికల పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి రిజల్ట్స్ అనౌన్స్ చేయనున్నారు. అయితే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు బలాలు, బలహీనతలు ఏంటో ఒకసారి చూద్దాం!
ప్రకాష్ రాజ్ – మెగాఫ్యామిలీ సపోర్ట్ తో పాటు సామాజిక అంశాలపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఇండస్ట్రీలో దర్శకనిర్మాతలతో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. రెండు నెలల ముందే ప్యానల్ ను ప్రకటించి.. ఒక విజన్ తో అందరినీ కలుస్తూ మద్దతు కూడగట్టుకున్నారు. పైగా ఈ ప్యానెల్ లో ఉన్నవారంతా కూడా పేరున్న నటీనటులు.
ఇక బలహీనత విషయానికొస్తే.. ప్రకాష్ రాజ్ లోకల్ కాదనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది. అతడికి కోపం ఎక్కువ అని.. ఆవేశపరుడని అంటుంటారు. నడిగర్ సంఘంలో అతడి కారణంగానే వివాదాలు చోటుచేసుకున్నాయి. ‘మా’ నుంచి కూడా అతడిని సస్పెండ్ చేశారు. అతడి మేనిఫెస్టో కూడా ‘మా’ సభ్యులను ఆకట్టుకోలేకపోయింది.
మంచు విష్ణు – మోహన్ బాబు కొడుకు అనే ట్యాగ్ విష్ణుకి బాగా కలిసొస్తుంది. ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాల మద్దతు మొత్తం విష్ణుకే ఉందనేది స్ఫష్టమైంది. యంగ్ బ్లడ్, విద్యాసంస్థలు నడుపుతున్న అనుభవం కూడా ఉంది. తెలుగువాడు, హైదరాబాద్ లోనే ఉంటాడనేది మరో ప్లస్ పాయింట్. రాజకీయం పార్టీలతో మంచి అనుబంధాలు ఉన్నాయి. మేనిఫెస్టోలో అంశాలు కూడా చాలా క్లియర్ గా, ‘మా’ సభ్యులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఇక బలహీనతలంటే.. విష్ణుకి ఎలాంటి అనుభవం లేదు. ప్రచారాల్లోనే చాలా దూకుడుగా వ్యవహరించారు. పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ అతడికి నెగెటివిటీను తీసుకొచ్చాయి. కులాన్ని నమ్ముకున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు