Allari Naresh: సినీ కెరియర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లరి నరేష్!

అల్లరి నరేష్ తాజాగా ఉగ్రం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. విజయ్ కనకమెడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో నరేష్ పవర్ ఫుల్ సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీ అయ్యారు.

ఒకప్పుడు అన్ని కామెడీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన (Allari Naresh) అల్లరి నరేష్ ఈమధ్య కాలంలో చాలా సీరియస్ పాత్రలలో నటిస్తూ తన నటనలో మరో యాంగిల్ కూడా ఉంది అంటూ ప్రేక్షకులకు చూపించబోతున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన తన సినీ కెరియర్ గురించి పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ఉగ్రం తనకు 60 వ సినిమా అని తెలియజేశారు.

ఇలా నా సినీ కెరియర్ లో 60 సినిమాలలో నటిస్తూ 60 శుక్రవారాలను చూశానని తెలిపారు. అయితే ఒకానొక సమయంలో తన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో చాలామంది నా నటన గురించి ఎన్నో కామెంట్స్ చేశారు. ఒకానొక సమయంలో కొందరు ఇక తాను సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదని కూడా కామెంట్స్ చేశారని నరేష్ ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇక తాను సినిమాలకు దూరం అవ్వడం అనేది జరగదని ఒకవేళ తాను చనిపోతే తప్ప సినిమాలకు దూరం అవ్వడం అనేది జరుగుతుంది అంటూ ఈ సందర్భంగా ఈయన తన సినీ కెరియర్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ప్రముఖ డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అల్లరి సినిమా ద్వారా హీరోగా అడుగుపెట్టిన నరేష్ ఇప్పటివరకు 60 సినిమాలలో నటించారు. మరి ఉగ్రం సినిమా నరేష్ కి ఎలాంటి సక్సెస్ అందించబోతుందో తెలియాల్సి ఉంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus