Hero Arya: ‘కెప్టెన్’ కి సీక్వెల్ ఉంటుంది.. ‘రాజా రాణి’ అంత పెద్ద హిట్ అవుతుంది: హీరో ఆర్య

  • September 8, 2022 / 11:59 AM IST

తమిళ హీరో ఆర్య తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే! అతను హీరోగా రూపొందిన ‘నేనే అంబానీ’ ‘ఆట ఆరంభం’ ‘వాడు వీడు’ ‘రాజా రాణి’ వంటి చిత్రాలు తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. అతను హీరోగా రూపొందిన కొత్త మూవీ ‘కెప్టెన్’ సెప్టెంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐశ్వర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ వంటి వారు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. శక్తి సౌందర్ రాజన్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘థింక్ స్టూడియోస్ అసోసియేషన్‌తో’ నిర్మాణ సంస్థ ‘ది స్నో పీపుల్’ పతాకంపై ఆర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘శ్రేష్ఠ్ మూవీస్’ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ & హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఆర్య కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు :

ప్ర. ‘కెప్టెన్’ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది?

ఆర్య : శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో నేను ‘టెడ్డీ’ సినిమా చేశా. దాని తర్వాత ‘కెప్టెన్’ కథతో ఆయన నా దగ్గరకు వచ్చారు. బహుశా, వేరే దర్శకుడు ఈ కథ చెప్పి ఉంటే నేను చేసేవాడిని కాదు. ఆల్రెడీ శక్తితో పని చేసి ఉండటం, ఆయనకు వీఎఫ్ఎక్స్ మీద అవగాహన ఉండటంతో ఓకే చెప్పాను. ఫస్ట్ ఐడియా విన్నాక… ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. ఆర్మీ నేపథ్యంలో సినిమా ఉంటుంది. సాధారణంగా ఆర్మీ నేపథ్యం అనగానే… పాకిస్తాన్ లేదా తీవ్రవాదులతో ఫైట్ ఉంటుంది. కానీ, మా సినిమాలో ఒక వింత జీవి ఉంటుంది. దాని వల్ల మనుషులకు ఎటువంటి ప్రమాదం ఉంది? దాన్ని ఏం చేశాం? అనేది సినిమా.

ప్రశ్న: ‘ప్రెడేటర్’ సినిమా దీనికి స్ఫూర్తి అనుకోవచ్చా?

ఆర్య : ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన తర్వాత ‘ప్రెడేటర్’లా ఉందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, కాదు. ఇది పూర్తిగా వేరే కథ. ఒక వింత జీవి ఉంది. థియేటర్లలో చూస్తే బాగుంటుంది. థియేటర్లలో ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియ‌న్స్ ఇస్తుంది.

ప్రశ్న: ‘కెప్టెన్’ సినిమాకు నిర్మాతగా కూడా చేశారు..! మీకు ఛాలెంజింగ్ అనిపించిన విషయాలు ఏంటి?

ఆర్య : వీఎఫ్ఎక్స్ వర్క్స్. ఇటువంటి సినిమాలు హాలీవుడ్‌లో వచ్చాయి. మన వీఎఫ్ఎక్స్ వ‌ర్క్‌ను అక్కడి సినిమాలతో పోలుస్తారు. మనకి బడ్జెట్ లేదు కాబట్టి ఆ స్థాయిలో చేయలేకపోయామని చెప్పలేం. అందుకని, ఆ విషయంలో చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. ఇప్పుడు మన ఇండియాలో కూడా మంచి టెక్నీషియన్లు ఉన్నారు. వాళ్ళు చాలా బాగా చేశారు.

ప్రశ్న : నటుడిగా ఛాలెంజింగ్ అనిపించింది ఏమైనా ఉందా?

ఆర్య : నటుడిగా ఛాలెంజింగ్ అంటే…. క్లైమాక్స్ పార్ట్ షూట్ చేయడం! ప్రచార చిత్రాల్లో చూపించిన జీవి నటీనటుల ముందు ఉండదు. కానీ, ఊహించుకుని షూటింగ్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే… భూమికి వంద అడుగుల ఎత్తులో, నీటిలో 20 అడుగుల లోతులో సన్నివేశాలు ఉన్నాయి. అవి షూటింగ్ చేయడానికి కష్టపడ్డాను. ఒక్కసారి నీటిలోకి వెళ్ళిన తర్వాత ప్రతిసారి పైకి రాలేను కదా! అందుకని, స్కూబా డైవింగ్ కు ఉపయోగించే ఎక్విప్‌మెంట్‌ మేం ఉపయోగించాం. ఆ మూడు రోజులు కష్టపడ్డాను.

ప్రశ్న: ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ క్రియేచర్ ఫిల్మ్ ఇదే అనుకోవచ్చా?

ఆర్య : అవును. ‘కెప్టెన్’లో క్రియేచర్ మొత్తాన్ని క్రియేట్ చేయడానికి మేం కొంచెం కష్టపడ్డాం. దర్శకుడు శక్తికి వీఎఫ్ఎక్స్ ఫిల్మ్ ఎలా షూట్ చేయాలో తెలుసు కాబట్టి… నేను రిస్క్ చేశాను. లేదంటే ముందు చెప్పినట్లు వేరే దర్శకుడు అయితే చేసే వాడిని కాదు.

ప్రశ్న : మీరు ‘వాడు – వీడు’ వంటి డిఫరెంట్ సినిమాలు కెరీర్ స్టార్టింగ్‌లో చేశారు. ఇప్పుడు ‘టెడ్డీ’, ‘సార్‌ప‌ట్ట‌’, ‘కెప్టెన్’…ఇలా మళ్ళీ డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. కమర్షియల్ జానర్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నమా?

ఆర్య : అలా ఏమీ లేదు. నా దగ్గరకు కథలు వస్తున్నాయి. నేను రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. రిస్కీ స్క్రిప్ట్ ఉన్న దర్శకులు వేరే హీరోలు ఎవరూ చేయకపోతే ఆర్య చేస్తాడని నా దగ్గరకు వస్తున్నారు. ఆర్య ప్రొడ్యూస్ కూడా చేస్తాడని…. నాతో ఛాన్స్ తీసుకుంటారు.

ప్రశ్న: కథ విన్నాక… సెట్స్ మీదకు వెళ్లే ముందు మీరు ఎలాంటి హోమ్ వర్క్ చేశారు?

ఆర్య : ఆర్మీ సినిమా కాబట్టి ప్రతీది పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకున్నాం. అందుకని, కాస్ట్యూమ్ అన్నీ ఢిల్లీలో ఇండియన్ ఆర్మీ కోసం యూనిఫామ్ కుట్టేవాళ్ళ దగ్గర కుట్టించాం. కలర్ నుంచి ఏ విషయంలో తప్పు జారగకూడదని చూశాం. ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి షూటింగ్ చేసేటప్పుడు సెట్స్ లో ఉండేలా చూసుకున్నాం. గన్ పట్టుకోవడం నుంచి రన్నింగ్, ఉన్నత అధికారులకు సెల్యూట్ చేసే వరకు ప్రతి విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నాం.

ప్రశ్న: తెలుగులో ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ విడుదల చేస్తోంది. వాళ్ళ గురించి…?

ఆర్య : నితిన్ నాకు మంచి ఫ్రెండ్. కమల్ హాసన్ గారి ‘విక్రమ్’తో భారీ హిట్ అందుకున్నారు. ‘కెప్టెన్’ ఆ సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేస్తుందనే నమ్మకంతో ఉన్నాను.

ప్రశ్న: ‘కెప్టెన్’కు సీక్వెల్ ఉంటుందా?

ఆర్య : ‘టెడ్డీ’ సినిమా చివర్లో టెడ్డీ కన్ను తెరుస్తుంది కదా! అలా ఈ సినిమాలో కూడా సీక్వెల్ చేసే విధంగా చిన్న హింట్ ఇచ్చాం. ‘కెప్టెన్’ మంచి విజయం సాధిస్తే తప్పకుండా సీక్వెల్ ఉంటుంది.

ప్రశ్న: మళ్ళీ తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తారు?

ఆర్య : అవకాశం వస్తే తెలుగులో చేయడానికి నేను ఎప్పుడూ రెడీ. ఇప్పుడు తెలుగు, తమిళం అని డిఫరెన్స్ లు లేవు. మన దగ్గర కొరియన్ టీవీ సీరియల్స్ కూడా చాలా మంది పిల్లలు చూస్తున్నారు. అందువల్ల, మంచి సినిమా తీస్తే అందరూ చూస్తారు.

ప్రశ్న : తెలుగులో మీ సినిమాలు చాలా డబ్ అయ్యాయి. మీకు ఎక్కువ గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ఏమనుకుంటున్నారు?

ఆర్య: ‘రాజా రాణి’. అందులో ఎలాంటి సందేహం లేదు. ‘కెప్టెన్’ కూడా ఆ సినిమా అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.

ప్రశ్న: మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

ఆర్య : సిద్ధార్థ్ ‘గృహం’ తీసిన మిళింద్ రావు దర్శకత్వంలో అమెజాన్ కోసం ‘విలేజ్’ వెబ్ సిరీస్ చేశా. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కావచ్చు. కార్తీ హీరోగా ‘విరుమాన్’ తీసిన ముత్తయ్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాను. కథలు వింటున్నాను. ఓకే అయ్యాక చెబుతా.

ప్రశ్న: మీ డ్రీమ్ రోల్ ఏంటి?

ఆర్య : డ్రీమ్ రోల్ ఏదీ లేదు. నా దగ్గరకు వచ్చిన క్యారెక్టర్‌ను ప‌ర్‌ఫెక్ట్‌గా చేయాలని అనుకుంటున్నాను. ఒకవేళ ఆ క్యారెక్టర్‌కు మరొకరు సూట్ అవుతారని అనుకుంటే ఆ విషయం చెబుతాను.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus