గంగూలీ బయోపిక్‌ హీరో అతనే అంటున్నారు… అయితే అదుర్స్‌ అంతే!

క్రికెటర్లలో ఒక క్రికెటర్‌ జీవితాన్ని సినిమాగా తీయాలన్నా, ఆ సినిమా విజయం సాధించాలన్నా.. అందులో ఓ ఎమోషన్‌, కొన్ని ట్విస్ట్‌లు, అంతకుమించి అదిరిపోయే కెరీర్‌ ఉండాలి. అచ్చంగా ఇలాంటి అన్ని ఎలిమెంట్స్‌ ఉన్న క్రికెటర్‌ బెంగాల్‌ కా దాదా సౌరభ్‌ గంగూలీ. అనతి కాలంలోనే స్టార్‌ బ్యాటర్‌గా మారిన గంగూలీ ఆ తర్వాత తన ఆల్‌రౌండర్‌ ప్రతిభతో వావ్‌ అనిపించాడు. ఆ వెంటనే కెప్టెన్‌ అయ్యి జట్టుకు దూకుడు నేర్పించాడు. ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడిగా భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు.

ఇదంతా బయటకు కనిపించేదే. అయితే అందరికీ తెలియని చాలా విషయాలు ఆయన జీవితంలో ఉన్నాయి. అలాంటి అన్ని విషయాలను కూలంకషంగా సినిమా రూపంలో వివరించడానికి సన్నాహాలు చివరి దశకు వచ్చాయి. ఈ క్రమంలో గంగూలీగా కనిపించబోయే హీరో ఎవరు అనే విషయం కూడా తేలిపోయింది అని సమాచారం. జీవిత కథల్లో నటించిన అనుభవం ఉన్నాదనో లేక ఇంకే కారణంతోనే కానీ.. ఈ సినిమాకు రణ్‌బీర్‌ కపూర్‌ను హీరోగా ఎంచుకున్నారని సమాచారం.

త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి సినిమా స్టార్ట్‌ చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం రణ్‌బీర్‌ కపూర్‌ ‘యానిమిల్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఆ పనులు పూర్తి చేసిన గంగూలీ సినిమా సెట్స్‌లో అడుగుపెడతాడట. గంగూలీ సినిమాను మొదలెట్టడానికి ముందు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దాదా సమక్షంలోనే క్రికెట్ ట్రైనింగ్‌ తీసుకోవాలని రణ్‌బీర్ అనుకుంటున్నాడట. అలాగే గంగూలీ ఇల్లు, బారిసా హౌస్, మోహన్ బగాన్ క్లబ్ వంటి ప్రదేశాల్లోనూ తిరిగి గంగూలీ గురించి చాలా విషయాలను తెలుసుకోబోతున్నాడట.

అలాగే ఆ రోజుల్లో గంగూలీతో క్రికెట్‌ ఆడినవారిని కూడా కలుస్తారట. ఇందాక చెప్పినట్లు రణ్‌బీర్‌కి బయోపిక్‌ అనుభవం ఉంది. సంజయ్ దత్ బయోపిక్ ‘సంజూ’ సినిమాలో రణ్‌బీర్ అదరగొట్టాడు. ఇప్పుడు గంగూలీ రోల్‌లో అదే పని చేస్తాడని ఆశించొచ్చు. సంజూ సినిమాను డైరెక్ట్ చేసిన రాజ్‌కుమార్ హిరాణీయే ‘దాదా’ మూవీని డైరెక్ట్ చేస్తారని అంటున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus