Hero: భార్యతో విడాకుల విషయంలో క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో ఎవరంటే..?

(Star Hero) సినిమా ఇండస్ట్రీలో లవ్, బ్రేకప్ కామన్ అయిపోయాయి.. ఎంత త్వరగా రిలేషన్ స్టార్ట్ చేసి.. పెళ్లిళ్లు చేసుకుంటున్నారో.. అంతే త్వరగా విడిపోతున్నారు.. సెలబ్రిటీల వ్యవహారం చూసి.. వీళ్లకి ప్రేమ, పెళ్లి అంటే ఎంత చులకన అయిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. బాలీవుడ్‌లో ఈ తరహా వ్యవహారాలు కొంచెం ఎక్కువనే చెప్పాలి.. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకుని.. త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన వాళ్లు కూడా ప్యాకప్ చెప్పేసుకుంటున్నారు.. రీసెంట్‌గా ఈ లిస్టులో ఓ స్టార్ కపుల్ పేరు వినిపించింది..

దీంతో ఈ వార్తలపై సదరు స్టార్ హీరో క్లారిటీ ఇచ్చాడు.. వివరాల్లోకి వెళ్తే.. బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల, కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే.. అయితే విష్ణు చేసిన ఓ ట్వీట్ కారణంగా వీరు విడిపోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి.. దీని గురించి ఆయన క్లారిటీ ఇచ్చాడు.. ‘నేను ఎంతో ప్రయత్నించాను.. కానీ ఓటమి చెందుతూనే ఉన్నాను.. అయినా పర్లేదు.

ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నాను.. ఇదేమీ ఓటమి కాదు.. పూర్తిగా నాదే తప్పు.. అది ఒక మోసపూరిత ద్రోహం’ అంటూ ‘లైఫ్ లైసెన్స్’ హ్యాష్‌ట్యాగ్‌తో ఒక ట్వీట్ చేశాడు.. ఇక అంతే.. ఆ ట్వీట్ చూసి నెటిజన్స్ విడాకుల కథలు అల్లేశారు.. విష్ణు, జ్వాల మధ్య ఏదో జరిగిందని.. విడాకులు తీసుకోబోతున్నారంటూ పుకార్లు పుట్టించారు.. అయితే దీనిపై విష్ణు విశాల్ స్పందిస్తూ మరో ట్వీట్ వేశాడు..

తన ట్వీట్‌ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారని, అది కేవలం తన ప్రొఫెషన్ గురించి చేసిందని, పర్సనల్ లైఫ్ గురించి ట్వీట్ చేయలేదని అన్నాడు.. ‘ఎవరికైనా మనం ఇవ్వగలిగే పెద్ద బహుమతి నమ్మకం మాత్రమే.. ఒకవేళ ఆ నమ్మకాన్ని ఇవ్వడంలో ఫెయిల్ అయితే మనల్ని మనమే నిందించుకుంటాం.. మన పట్ల మనం మరీ కఠినంగా ఉండకూడదు, అదే నా పాత ట్వీట్‌కి అర్థం’ అంటూ రూమర్లకు చెక్ పెట్టాడు విష్ణు విశాల్..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus