Kartikeya,Ajith: ఆ టైటిల్ నేనే చెప్పానంటున్న కార్తికేయ!

ఆర్ఎక్స్ 100 సినిమాతో సక్సెస్ ను అందుకున్న కార్తికేయకు ఆ సినిమా తర్వాత నటించిన సినిమాలేవీ ఆ స్థాయిలో పేరు తెచ్చిపెట్టలేదు. కార్తికేయ నటించిన రాజా విక్రమార్క సినిమా ఈ నెల 12వ తేదీన రిలీజ్ కానుండగా కార్తికేయ ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. పెళ్లి, సినిమా ప్రమోషన్స్ ఒకే సమయంలో జరుగుతున్నాయని డిసెంబర్ లో కొత్త సినిమా షూటింగ్ ను మొదలుపెడతామని కార్తికేయ తెలిపారు.

రాజా విక్రమార్క మూవీలో కామెడీ టైమింగ్ ఉన్న పాత్రలో నటిస్తున్నానని ఈ సినిమా జోనర్ టచ్ చేయని జోనర్ అని కార్తికేయ చెప్పుకొచ్చారు. తెలుగులో స్టైలిష్ కాప్ సినిమాలు తక్కువగా తెరకెక్కాయని మేకింగ్ సమయంలో తమకు ఈ సినిమాపై నమ్మకం పెరిగిందని కార్తికేయ అన్నారు. ఈ సినిమాకు రాజా విక్రమార్క అనే టైటిల్ ను తానే సూచించానని చిరంజీవి గారి టైటిల్ వల్ల సినిమాకు పబ్లిసిటీ వస్తుందని తాను అనుకోలేదని కార్తికేయ చెప్పుకొచ్చారు.

అజిత్ గొప్ప మనిషి అని ఆయనను కలిసే వరకు టెన్షన్ ఉన్నా కలిసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిందని కార్తికేయ వెల్లడించారు. గత సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయో రీజన్స్ తెలుసుకుని తరువాత సినిమాల విషయంలో ఆ తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటానని కార్తికేయ అన్నారు. అన్ని జోనర్ల సినిమాలు చూస్తానని ప్రస్తుతం సినిమాల ఈక్వేషన్ మారిందని కార్తికేయ తెలిపారు. తమిళంలో కూడా తనకు ఆఫర్లు వస్తున్నాయని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో, క్లాక్స్ అనే డైరెక్టర్ డైరెక్షన్ లో తాను నటిస్తున్నానని కార్తికేయ చెప్పుకొచ్చారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus