‘హాయ్ నాన్న’… ఈ సినిమాకు అనౌన్స్‌మెంట్ నుండే పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఎందుకంటే అంత పాజిటివ్‌గా, ఇన్నోవేటివ్‌గా ఆ సినిమాను ప్రకటించారు కాబట్టి. తండ్రీ కూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే సినిమా అని ఆ రోజే చెప్పేశారు. తండ్రి, కూతుర్ని మాత్రమే అనౌన్స్‌మెంట్‌లో చూపించారు కాబట్టి… మదర్ ఎలిమెంట్ కూడా కీలకం అని చెప్పేశారు. ఇప్పుడు వచ్చిన టీజర్, ట్రైలర్ కూడా సినిమా మీద ఆసక్తి పెంచాయి. ఈ సినిమా ప్రచారంలో నాని చెప్పిన మాటలు ఇంకాస్త మూడ్‌ను హిట్ మోడ్‌లోకి తీసుకెళ్లాయి.
ట్రైలర్‌లో నానిని చూసినప్పుడు.. భలే ఉన్నాడే అనిపించి ఉంటుంది మీకు. అయితే నానికి కూడా అలానే అనిపించిందట. తొలిసారి తెరపై నన్ను నేను ఆ ట్రైలర్‌లో చూసుకున్నప్పుడు ‘వీడెవడో బాగున్నాడే’ అని అనిపించిందట. ఇప్పటిదాకా చూడనిది, ఊహించనిది సినిమాలో బోలెడంత ఉంది అంటూ అంచనాలు మరింత పెంచాడు నాని. ప్రతి ఒక్కరూ ఈ సినిమాతో ప్రేమలో పడతారు అని కూడా అంటున్నాడు.
అంతేకాదు సినిమా అనేది తనకు ఆక్సిజన్‌తో సమానమని చెప్పిన నాని… అలాంటి ఊపిరి దానిపై ఒట్టేసి చెబుతున్నా డిసెంబర్ 7న అందరూ ప్రేమలో పడిపోయే సినిమా ఇది అని అన్నాడు. మా బాధ్యతగా మంచి సినిమా చేశామని, ఇక దానిని ఆదరించే బాధ్యత ప్రేక్షకులది అని తేల్చేశాడు. తాను కొత్త ప్రయత్నం చేసిన ప్రతిసారీ ‘ఇది చూడరు, ఇది రిస్క్’ అని చుట్టూ ఉన్నవాళ్లు అనేవారని, కానీ అలా మాటలు వచ్చిన ప్రతిసారీ ఆ మాటలు తప్పు అని ప్రేక్షకులు నిరూపిస్తూనే ఉన్నారని గుర్తు చేశాడు.
అలాంటి ప్రేక్షకులు, అభిమానులు ఉండటం తన అదృష్టం అని (Nani) నాని చెప్పుకొచ్చాడు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో బేబి కియారా ఖన్నా కీలక పాత్రధారి. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని. మోహన్ చెరుకూరి, డా.విజేందర్ రెడ్డి తీగల నిర్మించారు. మీకు తెలుసుగా ఈ సినిమా తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతోంది.
ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!
కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!