కుటుంబ సభ్యుల కోసం ప్రివ్యూ థియేటర్ బుక్ చేసిన నాని

ఐమాక్స్ థియేటర్ లో ఎర్లీ మార్నింగ్ 8:45 షో మిస్ అవుతానని నాచురల్ స్టార్ నాని అంటున్నాడు. అతడు విలన్ పాత్రలో నటించిన ‘వి’ థియేటర్లలో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల కానున్న సంగతి తెలిసిందే. కరోనా కాలంలో కొన్ని సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అయ్యాయి. ఇప్పటివరకు ఓటీటీల్లో రిలీజ్ అయిన తెలుగు సినిమాలతో కంపేర్ చేస్తే… ‘వి’ భారీ బడ్జెట్ సినిమా. స్టార్స్ నటించిన సినిమా కూడా ఇదే.

‘థియేటర్లలో కాకుండా ఓటీటీలో మీ ‘వి’ సినిమా విడుదల అవుతుండటం వల్ల మీరు ఏమైనా మిస్ అవుతున్నారా?’ అని నానీని ప్రశ్నించగా… “ఐమాక్స్ లో 8.45 షో మిస్ అవుతాను. ఐమాక్స్ థియేటర్ లో కర్టెన్ వెనక నిలబడి సినిమా చూడడం నాకు అలవాటు.‌ ప్రేక్షకుల రియాక్షన్స్ గమనిస్తుంటా. అదొక సెంటిమెంట్. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతున్న కారణంగా అలా చేయలేను” అని సమాధానం ఇచ్చారు. ప్రేక్షకులు ‘వి’ని ఓటీటీలో చూడాలి.

థియేటర్లలో విడుదల కావడం లేదు కాబట్టి అది ఒక్కటే ఆప్షన్. నాని కుటుంబ సభ్యులు మాత్రం ఈ సినిమాలో థియేటర్లో చూడనున్నారు. ఫ్యామిలీ కోసం నాచురల్ స్టార్ స్పెషల్ షో అరేంజ్ చేస్తున్నాడు. ఒక ప్రివ్యూ థియేటర్ స్పెషల్ గా బుక్ చేసి అందులో షో వేయడానికి ప్లాన్ చేశాడు.

Most Recommended Video

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus