‘దసరా’ దర్శకుడి గురించి హీరో నాని ఊహించని కామెంట్స్!

నేచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ సినిమాపై బజ్ ఓ రేంజ్లో ఉంది. టీజర్, ట్రైలర్, 2 పాటలు చాలా బాగుండడంతో పాటు కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే సంకేతాలు ఇచ్చాయి. మార్చి 30న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. చిత్ర బృందం గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ చేస్తుంది. పక్క రాష్ట్రాల్లో సినిమాను ప్రమోట్ చేయడానికి 5 స్టార్ హోటల్లో ఖరీదైన లగ్జరీ రూమ్ లు బుక్ చేసుకున్నప్పటికీ.. అక్కడ ఎక్కువగా స్టే చేస్తుంది లేదు.

వెంటనే ఫ్లైట్ ఎక్కేసి మరో రాష్ట్రం వెళ్తుంది చిత్ర బృందం. అంతలా టీం ఈ సినిమా సక్సెస్ కోసం కష్టపడుతుంది. అందరికంటే ఎక్కువగా నాని ఈ సినిమాని నిద్ర మానుకుని మరీ ప్రమోట్ చేస్తున్నాడు. ఆల్రెడీ నిర్మాత రూ.75 కోట్లు బడ్జెట్ పెట్టాడు. ఇప్పుడు ప్రమోషన్లకే మరో రూ.5 కోట్లు ఖర్చవుతుందని వినికిడి. ఇలాంటి టైంలో నాని.. ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ అనుకున్నట్టుగా సినిమా తీయలేదు అంటూ కామెంట్లు చేసి అందరికీ షాకిచ్చాడు.

అయితే సీరియస్ గా కాదు లెండి. ఇది ఫన్నీగానే..! సుమ హోస్ట్ చేస్తున్న ‘సుమ అడ్డా’ అనే షోలో ‘దసరా’ టీం సందడి చేసింది. ఈ షోలో భాగంగా ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ గురించి ఏదైనా చెప్పాలని నానిని కోరింది సుమ. అందుకు నాని ‘శ్రీకాంత్ నేను అనుకున్నంత బాగా దసరా మూవీ తియ్యలేదు’ అని చెప్పాడు. దీంతో దర్శకుడు శ్రీకాంత్ … నాని వైపు ఒక లుక్ ఇచ్చాడు. ప్రోమో కోసం ఇలా కట్ చేశారు. వారు అనుకున్నట్టే ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతుంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus