Hero Nani: అభిమాని సూటి ప్రశ్న.. హీరో నాని ఘాటు జవాబు ఇదే!

న్యాచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు సక్సెస్ సాధిస్తున్నా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. నాని నటిస్తున్న దసరా సినిమా 80 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమాతో సక్సెస్ సాధించడం కీర్తి సురేష్ కు సైతం కీలకం అనే సంగతి తెలిసిందే.

అయితే దసరా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక అభిమాని నీ సినిమాలు బాగుంటాయి కానీ డబ్బులు రావట్లేదు అని నానిని అడిగారు. నాని నటించిన దసరా మూవీ రన్ టైమ్ 2 గంటల 36 నిమిషాలు కావడం గమనార్హం. నెటిజన్ అడిగిన ప్రశ్నకు నాని జవాబిస్తూ నా ప్రొడ్యూసర్స్ మూవీ లాభాల గురించి మరో విధంగా చెబుతుంటారని నాని అన్నారు. కొన్నిసార్లు నా సినిమాల కలెక్షన్ల గురించి కూడా చెబుతుంటారని నాని అన్నారు.

నాని సినిమాలకు నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవుతున్నాయి. నాని పారితోషికం 18 కోట్ల రూపాయల నుంచి 22 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. నాని పారితోషికం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. నాని నటుడిగా తన రేంజ్ ను పెంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాని కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

టాలీవుడ్ టాప్ స్టార్స్ తో కలిసి నాని నటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ హీరోల మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండగా నాని విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. నాని స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. నాని ఇతర భాషల్లో కూడా మార్కెట్ ను పెంచుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus