కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడం స్టార్ హీరోల్లో నాగార్జునకు బాగా అలవాటు. నటుడిగా, నిర్మాతగా ఆయన ఇలా చాలామందికి బేస్ ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అది కొనసాగిస్తున్నారు. ఆయన చేస్తున్న ‘నా సామిరంగా’ సినిమా దర్శకుడు కూడా కొత్తవాడే. ప్రస్తుతం తరం స్టార్ హీరోలు అంటే కుర్ర స్టార్ హీరోల్లో ఇలాంటి పని చేస్తున్న హీరోల్లో నాని ఒకరు. ఆయన రీసెంట్ సినిమాలు చూస్తే కొత్త దర్శకులతోనే వస్తున్నాయి. ‘హాయ్ నాన్న’ సినిమా దర్శకుడు కొత్తవారే.
ఇప్పుడు ఈ ‘కొత్త’ అనే చర్చ ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే నాగార్జున మరో కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. అనుకుంటున్నారు ఏంటి ఇచ్చేశారు. అయితే ఆ వ్యక్తి దర్శకుడిగా కొత్త కావొచ్చు.. కానీ హీరోగా అందరికీ సుపరిచితమే. అతనే నాని. అవును నాని దర్శకుడిగా మారాలని అనుకుంటున్నాడు. అయితే అది ఇప్పుడు కాదు దానికి చాలా సమయం ఉంది. అయితే అలా మారితే చేసే తొలి సినిమాకు నాగార్జుననే హీరో.
ఈ విషయాన్ని ఇటీవల నాని, నాగార్జుననే చెప్పారు. ‘హాయ్ నాన్న’ సినిమా ప్రచారం కోసం నాని ఇటీవల ‘బిగ్‌బాస్’కి వచ్చాడు. ఆ స్టేజీ మీద నాగార్జున మాట్లాడుతూ ‘‘అసిస్టెంట్ డైరక్టర్‌గా కెరీర్ ప్రారంభించావు. మరి డైరక్టర్ ఎప్పుడు అవుతావు’ అని అడిగితే… ‘మీరు ఓకే అంటే మీతోనే నా తొలి సినిమా’ అని నాని చెప్పేశాడు. అయితే తాను అంతా ఓకే అనుకుని, దర్శకుడిగా మారాక తొలి సినిమా మీతోనే చేస్తాను, మీరు మాటిచ్చేశారు అని అన్నాడు.
దీంతో నాని (Nani) దర్శకుడిగా మారడం పక్కా అని తేలిపోయింది. అయితే ఎలాంటి కథతో వస్తాడు, ఎలా చేస్తాడు, నాగార్జునను ఎలా చూపిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే నాని అన్ని రకాల కథలు చేశాడు. అయితే ఎలాంటి కథను సిద్ధం చేసుకుంటాడు అనేది ఇక్కడ విషయం. ఈ విషయంలో ఇప్పట్లోనే క్లారిటీ రాదు కానీ… ఇంట్రెస్టింగ్ కాంబో అయితే దాదాపు సెట్ అయిపోయింది.