నేచురల్ స్టార్ నాని (Nani) కెరీర్ ప్రస్తుతం స్పీడ్ మోడ్‌లో ఉంది. వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్న నాని, కొత్త కొత్త జోనర్స్‌ను ఎక్స్‌ప్లోర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు హిట్ 3 (HIT 3) మూవీతో మాస్ పోలీస్ అవతారంలో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అర్జున్ సర్కార్ పాత్రలో నాని కనిపించబోతున్న ఈ చిత్రం ఇప్పటికే హైప్‌ను క్రియేట్ చేసింది. మే 1న విడుదలవుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక హిట్ 3 తర్వాత నాని ‘ప్యారడైజ్’ (The Paradise) అనే సినిమా చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో నాని చేసిన దసరా (Dasara) ఘన విజయం సాధించిన నేపథ్యంలో మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతోంది. మే 2 నుంచి షూటింగ్ మొదలవుతుందని, తాను 12వ తేదీ నుంచి సెట్స్‌లో అడుగుపెడతానని నాని స్వయంగా చెప్పాడు. 2026 మార్చి 26న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాని నటన కొత్త ట్రెండ్ గా నిలవనుందని భావిస్తున్నారు.
ప్యారడైజ్ తర్వాత నాని డాషింగ్ డైరెక్టర్ సుజీత్‌తో (Sujeeth) సినిమా చేయనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో (Pawan Kalyan) ఓజీ (OG Movie) సినిమా చేస్తున్న సుజీత్, ఆ తర్వాత నానితో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇది యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన కొత్త ప్రయోగం కావడం విశేషం. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) శేఖర్ కమ్ముల (Sekhar Kammula) లాంటి దర్శకులతో కూడా నాని ప్రాజెక్ట్స్ మీద చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.
నాని మాట్లాడుతూ త్రివిక్రమ్‌తో వెంకటేష్‌తో (Venkatesh) కలిసి సినిమా చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఎలాంటి అప్డేట్ లేదని స్పష్టం చేశాడు. శేఖర్ కమ్ములతో కూడా పలు కథలు చర్చలో ఉన్నాయని, కానీ ఇంకా ఫిక్స్ కాలేదని వెల్లడించాడు. అలాగే తమిళ దర్శకుడు సిబి చక్రవర్తితో (Cibi Chakaravarthi) కూడా ఒక.ప్రాజెక్టు లైన్ లో ఉన్నట్లు హింట్ ఇచ్చాడు.
మొత్తం మీద నాని లైనప్ చూస్తుంటే ఆయన కెరీర్‌కు ఏమీ తక్కువ అనిపించదు. కథతోనే కాదు, దర్శకుడితోనూ మ్యాచ్ అయ్యేలా ప్రాజెక్ట్స్‌ను ఎంచుకుంటున్న నాని సెలెక్షన్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలన్న నాని దృక్పథం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో తన లెవెల్‌ను మరోసారి నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నారు.