శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ‘హ్యాపీడేస్’ చిత్రంతో హీరోగా పరిచయమైన నిఖిల్.. అటు తర్వాత ‘యువత’ ‘కలవర్ కింగ్’ వంటి చిత్రాల్లో హీరోగా నటించాడు. అలాగే పలు మాస్ సినిమాల్లో కూడా నటించాడు కానీ సక్సెస్ కాలేకపోయాడు. దాంతో రూటు మార్చి ‘స్వామిరారా’ ‘కార్తికేయ’ ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ ‘అర్జున్ సురవరం’ వంటి యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీస్ లో నటించి హిట్లు అందుకున్నాడు. అయితే మొదటి సారి ఇతను ’18 పేజెస్’ అనే డిఫరెంట్ లవ్ స్టోరీ లో నటిస్తున్నాడు.
పలనాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా సుకుమార్.. కథ మరియు స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం.ఈరోజు నిఖిల్ పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ సభ్యులు ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. అంతేకాకుండా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ .. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు .అతను మాట్లాడుతూ.. “ప్రేమ కథా చిత్రాలు అంటే నాకు మొదటి నుండీ భయం. వాటిలో ఎక్కువగా గొడవలు పడడం,విడిపోవడం,చివరికి కలవడమే ఉంటుంది అని నాకు అనిపిస్తుంటుంది.
ఈ కారణంతోనే నేను ఎక్కువగా మిస్టరీ లేదా యాక్షన్, అడ్వెంచర్ జోనర్ కు సంబంధించిన మూవీస్ చేస్తుంటాను. సుకుమార్ గారి స్టోరీస్ అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. ’18 పేజెస్’ కథ కూడా అలాగే ఉంటుంది. వినగానే నాకు నచ్చేసింది. అందుకే వెంటనే ఓకే చెప్పాను.నా గత సినిమాల్లో గమనిస్తే.. లవ్ సీన్స్ ఉంటాయి కానీ అవి పూర్తిస్థాయి లవ్ స్టోరీస్ కాదు. అలాగే ఆ సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ లో నటించేప్పుడు పల్లవిని( భార్య) ఊహించుకునే యాక్ట్ చేసాను. పెళ్లి తర్వాత రొమాంటిక్ సీన్స్ లో నటించడం అనేది మరింత ఈజీ అనిపిస్తుంది” అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు.